Gayathri Jayanthi: మన హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్లాపక్ష ఏకాదశి రోజున గాయత్రీ దేవి జన్మదినం జరుపుకుంతారు. మన హిందూ సంప్రదాయంలో గాయత్రీ దేవి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున నియమనిష్టలతో గాయత్రీ దేవిని పూజించడం వల్ల వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ ఏడాది గాయత్రి దేవి వ్రతాన్ని ఎప్పుడు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం మే 31వ తేదీ బుధవారం గాయత్రి జయంతి జరుపుకుంటారు. అలాగే ఈ రోజున నిర్జల ఏకాదశి కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది గాయత్రి దేవి వ్రతం చేయటానికి మే 30 2023న మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుంచి పూజా సమయం మొదలవుతుంది.. మే 31వ తేదీ మధ్యాహ్నం 1:45 నిమిషములకు ముగుస్తుంది. అయితే గాయత్రి జయంతి రోజున గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి.
Gayathri Jayanthi:
అంతేకాకుండా ఇలా గాయత్రి దేవి వ్రతాన్ని చేయటం వల్ల జీవితంలో మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. సనాతన సంప్రదాయం ప్రకారం గాయత్రీ అమ్మవారు 4 వేదాలకు మూలంగా ప్రజలు నమ్ముతారు. గాయత్రి అమ్మవారిని సరస్వతీ, లక్ష్మీ, కాళీ మాతకు చిహ్నంగా పరిగణిస్తారు. వేదాలు గాయత్రీ దేవి నుంచి ఉద్భవించాయని పండితులు చెబుతున్నారు. నేను జీవితంలో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు నియమనిష్టలతో గాయత్రీ దేవి మంత్రాన్ని జపిస్తూ పూజించటం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు.