Garuda Puranam: ఒక మనిషి అన్న తర్వాత కష్టసుఖాలు మంచి చెడులు జరగడం సర్వసాధారణం అయితే ఎప్పుడూ కూడా జీవితం ఒకేలా ఉండదు కొన్నిసార్లు మంచి జరిగితే మరి కొన్నిసార్లు చోటు జరుగుతుంది అయితే చెడు వెంటనే మంచి కూడా జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు మంచి జరగబోతుంది అనడానికి ముందుగా కొన్ని మనకు సంకేతాలు తెలుస్తూ ఉంటాయి.గరుడ పురాణం ప్రకారం మనిషికి మంచి జరుగుతుంది అంటే ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయని తెలుస్తోంది. మరి ఆ లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే…
తరచు మీ ఇంటికి ఆవు కనుక వస్తుంది అంటే త్వరలోనే మీకు మంచి జరగబోతుందని అర్థం ఇలా ఇంటికి ఆవు వస్తే తప్పనిసరిగా ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం మంచిది.ఇక ఏదైనా పక్షి మన ఇంటి ఆవరణంలో గూడు పెట్టుకొని పిల్లల్ని కనక పెడితే మన ఇంటికి త్వరలోనే శుభం జరగబోతుందని మన కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం.బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మనకు తెలియకుండానే మన నోటి వెంట నారాయణ అనే మంత్రం వినపడితే మనకు శుభం కలుగుతుందని సంకేతం.
Garuda Puranam:
ఇక నిద్రపోతున్న సమయంలో బల్లి ముంగిస గులాబీ వంటివి కనుక కలలో కనపడితే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. ఇక ఏదైనా పనిమీద మనం బయటకు వెళ్తున్న సమయంలో కుక్క బయట తింటూ కనపడితే కనుక మనకి శుభం జరగబోతుందని తెలిపే సంకేతం. ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా చిన్న పిల్లలు ఏడుపు మాని నవ్వుతూ ఉన్నారు అంటే అది శుభానికి సంకేతం అని చెప్పాలి. ఇలాంటి లక్షణాలు కనుక తరచూ మన ఇంట్లో కనబడుతూ ఉంటే త్వరలోనే మనకు మంచి రోజులు రాబోతున్నాయని గరుడ పురాణం తెలియజేస్తుంది.