Marriage: గంగా సప్తమి గంగాదేవికి ఎంతో కీలకమైనదని చెప్పాలి. ఈ గంగ సప్తమినీ ప్రతి ఏడాది
వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గంగా సప్తమి పండుగను 14 మే 2024 మంగళవారం జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున జాహ్నవి మహర్షి తన చెవి నుంచి గంగను విడుదల చేశాడు. అలాగే ఈ గంగా సప్తమి రోజు గంగాదేవి తిరిగి భూమి పైకి వచ్చిందని నమ్ముతారు అందుకే ఈరోజు ప్రత్యేకంగా గంగాదేవిని ప్రత్యేకంగా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతారు.
ముఖ్యంగా పెళ్లి కానటువంటి వారు తొందరగా పెళ్లి కావాలి అంటే గంగా సప్తమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే పెళ్లి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి గంగా సప్తమి రోజు ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే..వివాహం ఎవరికైనా ఆలస్యం అయితే గంగా సప్తమి రోజున.. గంగాజలంలో 5 బిల్వ పత్రాలు వేసి.. ఆ నీటితో భోలేనాథుడికి జలాభిషేకాన్ని ఆచారాల ప్రకారం చేయండి. ఇలా చేయడం వల్ల శివ, గంగలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. దీవెనలు ఇస్తారని నమ్ముతారు. అలాగే వివాహం జరగకుండా వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
ఇకపోతే మనం కొన్ని ముఖ్యమైన పనులను నెరవేర్చే క్రమంలో తరచు ఆటంకాలు ఏర్పడుతూ ఆ పనులు వాయిదా పడుతూ ఉంటాయి. ఇలా పనులు వాయిదా పడుతున్నాయి అంటే గంగా సప్తమి రోజు గంగలో పాలు పోసి, గంగామాత మంత్రాలను పద్దతిగా జపించండి. అలాగే గంగా తీరంలో కర్పూర దీపం వెలిగించి హారతిని ఇవ్వండి. ఇలా చేయటం వల్ల పనులు పూర్తవుతాయి.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.