Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ‘గేమ్ ఛేంజర్’ సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే కొందరిలో ఇదే సందేహం కలుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అడ్వానీ, అంజలి హీరో హీరోయిన్స్ గా శ్రీకాంత్, సూర్య, సముద్ర ఖని, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో శంకర్ మార్క్ మేకింగ్ ఎప్పటిలాగే కనిపించింది. కొత్తగా అంటే ఒక్క సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ మాత్రమే అనిపిస్తున్నాయంటున్నారు. చరణ్ పోషించిన పాత్రలు రెండు కూడా రంగస్థలం, ధృవ సినిమాలలోని పాత్రలను పోలి ఉన్నాయంటున్నారు.
Game Changer Trailer: ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్నవి డైలాగులు మాత్రమే.
ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్నవి డైలాగులు మాత్రమే. పొలిటికల్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. శంకర్ సినిమా అంటే గ్రాండ్ విజువల్స్ తో పాటు సామాజిక అంశం చుట్టూ కథ తిరుగుతుంటుంది. ఇందులో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. ట్రైలర్ లో కియారా పాత్ర అంజలి పాత్రలకి ప్రాధాన్యత ఎంతవరకూ ఉందో అని సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు, సాంగ్స్ చూస్తే..అపరచితుడు, రోబో, 3 ఇడియట్స్, ఐ సినిమాలలోని పాటలను గుర్తు చేస్తున్నాయి. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగాలేదని చెప్పుకుంటున్నారు.
కానీ, ఈవెంట్ లో మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది చిత్ర బృందం. మరీ ముఖ్యంగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హెలికాఫ్టర్ లో నుంచి చరణ్ కత్తి పట్టుకొని లుంగీ మీద దిగడం గురించి ప్రస్తావించడం బావుంది. దిల్ రాజు అండ్ కో మొదటిసారి భారీ బడ్జెట్ పెట్టి నిర్మించిన గేమ్ ఛేంజర్ హిట్టవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఫలితం ఎలా రానుందో.