Categories: HealthLatestNews

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్, పానీపూరి, గోబి వంటి వాటిని ఎక్కువగా తినడానికి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా పిల్లలు తరచూ ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉన్నారు అంటే కచ్చితంగా అనారోగ్య సమస్యల బారిన పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల దంతాలు పాడవడం నుంచి మొదలుకొని క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. మరి ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పిల్లలలో కలిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..

ఫాస్ట్ ఫుడ్ లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు నోట్లోకి చేరిన వెంటనే ఆమ్లాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆమ్లాలు పంటి పై పొరను పూర్తిగా దెబ్బతీయడంతో దంత క్షయం కలుగుతుంది. అదేవిధంగా పళ్ళ మధ్య భాగాలలో చిక్కుకుపోయిన ఆహార పదార్థాల కారణంగా బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నోటికి మాత్రమే పరిమితం కాకుండా రక్తప్రసరణ ద్వారా మన శరీర భాగాలన్నింటికీ చేరుకొని ఎన్నో రకాల రోగాలకు కారణమవుతాయి. ఫాస్ట్ ఫుడ్ లో ఉండే సోడియం మన శరీరంలో క్యాల్షియం తగ్గించి దంతాలు దృఢత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి.

Fast food can damage teeth and it causes mouth cancer know details

Fast Food: నోటి పుండ్లు క్యాన్సర్ కు కారణం..

ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలలో దంత సమస్యలు అధికమవుతాయి అంతేకాకుండా కొన్నిసార్లు నోట్లో రక్తస్రావం జరగడం నోటి పుండ్లు ఏర్పడటం, నాలుకపై మచ్చలు వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ నోటి పుండ్లు క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలను వీలైనంత ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచడం వల్ల వారికి సరైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వారు అవుతారు. ఫాస్ట్ ఫుడ్ తినడంలో తప్పులేదు కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అలా కాకుండా నిత్యం ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.