Categories: DevotionalLatestNews

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్ బుకింగ్ ఓపెన్..

Tirumala Darshan Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు టిటిడి శుభవార్తను తెలిపింది. మరికొద్ది రోజులలో స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్న వారు ముందస్తుగా 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు పొందితే దర్శనం సమయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.. అయితే ముందుగానే ఈ టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సంబంధించిన కోటా టీటీడీ విడుదల చేసింది.

సెప్టెంబర్ నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవాలనే భక్తులు వెంటనే ఈ టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా దర్శనం చేసుకోవచ్చు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (స్పెషల్ ఎంట్రీ దర్శన్) టికెట్ల కోటాను జూన్ 24వ తేదీ(నేడు)న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ ఉదయం సరిగ్గా 10 గంటలకు ఈ టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు వసతి గదుల కోట కూడా టీటీడీ విడుదల చేసింది. నేడుమధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ ప్రారంభం అవుతుంది. దర్శనం బుక్ చేసుకున్న భక్తులు తమ స్లాట్ సమయాన్ని బట్టి ఈ గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

TTD online booking alert rs 300 darshan tickets rooms quota releasing on June 24 th know details

Tirumala Darshan Tickets: అధికారక వెబ్ సైట్ ద్వారా టికెట్ బుకింగ్స్..

ఇలా ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్న సమయంలో భక్తులు కచ్చితంగా వారి గుర్తింపు కార్డు అయిన ఆధార్ వివరాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి.మీ వివరాలన్నింటినీ ఎలాంటి తప్పులు లేకుండా బుక్ చేసుకోవడం వల్ల దర్శన సమయంలో ఇబ్బందులు ఉండవు.ఆన్‌లైన్ పేమెంట్ కోసం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ విధానాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ టికెట్లను బుక్ చేసుకోవడం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని టీటీడీ పదేపదే స్పష్టం చేసింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

 

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.