Faima-Praveen : ప్రవీణ్, ఫైమా వీళ్లిద్దరి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర పైన ఎంటర్టైన్మెంట్ తో, కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వీరిద్దరు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఫైమాకు మంచి క్రేజీ లభించింది. వరుస ఆఫర్లతో కెరీర్ లో ముందుకెళ్తుంది. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఈ తమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రకటించారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. పలు సందర్భాల్లో టీవీ స్టేజీల పైన కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరికి సంబంధించిన ఎలాంటి న్యూస్ ఇప్పుడు వినిపించడం లేదు.అయితే,ప్రవీణ్, ఫైమాలు బ్రేకప్ అయ్యారని వాళ్ళిద్దరూ ప్రస్తుతం లవ్ లో లేరన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ మొదటిసారిగా తమ రిలేషన్ గురించి స్పందించాడు.
” ఫైమా నేను మంచి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ షిప్ తోనే మా రిలేషన్ ఏర్పడింది. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆమె నాతోనే ఉంది. అందుకే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాను.కానీ ఆమె నా ప్రేమను రిజెక్ట్ చేసింది. నా ఇష్టమేంటో చెప్పాను. అది ఒప్పుకోవడం ఒప్పుకోకవడం ఆమె ఇష్టం. ఆమె నిర్ణయాన్ని నేనెప్పుడూ కూడా తప్పుపట్టను ఆమె నన్ను ప్రేమించక పోయినా నేను ఆమెతోనే ఉన్నాను. ఓ స్నేహితుడిగా ఆమెకు సహాయపడుతున్నాను. మా ఇద్దరి మధ్య లవ్ లేకున్నా మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాము. ఫ్రెండ్ లా ఆమె నాతో ఉన్నా కొన్నిసార్లు ఆమె నాకు నో చెప్పిందని బాదేసేది. ఒకానొక సమయంలో నేను బాగా ఏడ్చాను. ఎంతైనా ఫస్ట్ లవ్ ని అంత ఈజీగా మర్చిపోలేము కదా. అందుకే దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసాను.
లవ్ విషయం పక్కన పెడితే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నా ఫోకస్ అంతా ఇప్పుడు వాటిపైనే. వాటితోనే పోరాటం చేస్తున్నాను. ఈ మధ్యనే మా నాన్న చనిపోయారు. ఆయన చనిపోయాక చాలా విషయాలు తెలిసాయి. నాకున్న అప్పులు ఎంతో తెలుసుకున్న. ఇప్పుడు అప్పులను తీర్చే పనిలోనే ఉన్నాను. దేనిపైన నా దృష్టి లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఫైమా నన్ను ప్రేమిస్తున్నానని నా దగ్గరికి వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తా”.అని ప్రవీణ్ తెలిపాడు.
బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చాక సెలబ్రిటీ స్టేటస్ రాగానే ఫైమా ప్రవీణ్ ని పక్కన పెట్టేసిందని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఈ వార్తల పైన ప్రవీణ్ స్పందించాడు.”బిగ్ బాస్ షో నుంచి ఫైమా ఎలిమినేట్ అవ్వగానే బాగా ఫీల్ అయింది. కొన్ని రోజులు వరకు ఆమె ఎవరిని కలవలేదు. నాతో బాగానే మాట్లాడింది. ఫైమా షో లో ఉన్నప్పుడు బయటనుంచి నేను బాగా సపోర్ట్ చేశాను. నేను ఏ ప్రోగ్రాం చేసిన ఫైమాకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేసేవాడిని. ఫైమా నా పిల్ల అనుకుని నేను ఎంతో సపోర్ట్ చేశా. కానీ ఆమె నా లవ్ ని రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ నేను ఎప్పుడు ఆమెకు ఫ్రెండ్ గానే ఉంటాను”అని తెలిపాడు ప్రవీణ్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.