Facebook: సోషల్ మీడియా టెక్ కంపెనీలు తమ ఆదాయ మార్గాలని మరింతగావిస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ తన సైట్ లో బ్లూ టిక్ మార్క్ కోసం ప్రత్యేకంగా రుసువు అమల్లోకి తీసుకొచ్చింది. సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే బ్లూ టిక్ మార్క్ అనేది ఇస్తారు. అయితే వ్యక్తిగతంగా దీనికోసం ఒక్కో వ్యక్తి నుంచి వసూలు చేస్తున్న మొత్తం తక్కువగానే ఉన్నా కూడా మొత్తం చూసుకుంటే వేల కొట్లలో ఆదాయం ఆయా టెక్ కంపెనీలకి వచ్చిపడనుంది. ట్విట్టర్ ని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
తమ విస్తృత ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని బ్లూ టిక్ మార్క్ లో తమని తాము రిప్రజెంట్ చేసుకుంటారు. అయితే గతంలో ఉచితంగా ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ ఆయా వ్యక్తులకి సొసైటీలో వారికున్న ఫాలోయింగ్ బట్టి ఇచ్చేది. అయితే ఇప్పుడు ఎలాన్ మాస్క్ వచ్చిన తర్వాత బ్లూ టిక్ మార్క్ ఖరీధైపోయింది. సుమారు వెయ్యి రూపాయిల వరకు ప్రతి నెల బ్లూ టిక్ మార్క్ సబ్ స్క్రైబ్ కోసం వసూలు చేస్తున్నారు. అలాగే ఏడాది మొత్తానికి ఒకేసారి సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ఇప్పుడు ఈ బాటలో పేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. పేస్ బుక్ లో బ్లూ టిక్ మార్క్ కావాలని కోరుకునే వారు ఇకపై ఏడాదికి 12000 చందా చెల్లించాల్సిందే అని కొత్త నిబంధనని తీసుకొచ్చింది. నెలవారీగా కూడా సబ్ స్క్రైబ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ఐ ఫోన్ వినియోగదారులకి నెలకి 12 వందల రూపాయిలు బ్లూ టిక్ మార్క్ కోసం వసూలు చేస్తే ఆండ్రాయిడ్ వినియోగదారులకి మాత్రం 1000 రూపాయిలు మాత్రమే ఛార్జ్ చేస్తుంది. ఈ షబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఇకపై బ్లూ టిక్ మార్క్ అప్షన్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.