Pawan Kalyan: తెలుగు అగ్ర కథానాయకులలో ఇప్పటి వరకు కూడా ఒక్క పాన్ ఇండియా చిత్రంలో నటించకపోయినా ఆ రేంజ్ క్రేజ్ మార్కెట్ స్టామినా ఉన్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కెరీర్ ప్రారంభంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ దక్కాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా పవన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్‌కు కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్ వంటి శాఖల మీద మంచి అవగాహన ఉంది. ఆయన సినిమాలలో వల్గారిటీ ఉండాలని కోరుకోరు. అన్నీ వర్గాల ప్రేక్షకులు థియేటర్స్‌కు రావాలని ఆశపడుతుంటారు.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు అభిమానులకు, ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాలు. ఈ సినిమాలను ఒక్కొక్కరు ఎన్నిసార్లు చూసి ఉంటారో లెక్క చెప్పడం చాలా కష్టం. అంతగా పవన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా ఆయన సినిమాలు నాలుగు ఫ్లాయినా కూడా 5వ సినిమా వస్తుందంటే అదే క్రేజ్..ఫ్యాన్స్‌లో అదే ఊపు..అదే ఉత్సాహం. బహుషా ఇది పవన్ ఒక్కడికి మాత్రమే సాధ్యమైన విషయం అని చెప్పాలి. ఇక ఆయన రాజకీయా లలోకి వెళ్ళిన తర్వాత జనాల కోసం పనిచేయాలని భావించి సినిమాలను చేయకూడదని ప్రజా సేవకే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
Pawan Kalyan: పవన్ చేస్తున్న మొట్ట మొదటి భారీ బడ్జెట్ చిత్రం.
కానీ, దీనిని అభిమానులు ఒప్పుకోలేదు సరికదా మళ్ళీ ఆయన సినిమాలు చేస్తాను అనే వరకు ఎక్కడ కనిపించినా కూడా అడిగి మనసు మళ్ళీ సినిమా చేయాలనే విధంగా ప్రేరేపించారు..ఉత్సాహపరిచారు. మొత్తానికి పవన్ మళ్ళీ సినిమాలు చేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అదే విధంగా వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ మొహానికి రంగేసుకున్నారు. మంచి సోషల్ మెసేజ్ ఉన్న కథాంశంతో వచ్చి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పక్కా కమర్షియల్ సినిమాగా భీమ్ లా నాయక్ సినిమాను చేశారు. రానాతో నటనలో పోటీ పడి నటించిన పవన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి హిట్ అందుకున్నారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు..విదేశాలలో ఉన్న పవన్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఉబలాటంగా, ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడిగా విభిన్నమైన కథా చిత్రాలతో ఆకట్టుకొని జనాలను ప్రభావితం చేయగల టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి ఈ హరి హర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి పీరియాడిక్ నేపథ్యంలో చిత్ర కథ, కథనాలు సాగుతాయి. పవన్ కళ్యాణ్‌తో ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని నిర్మించిన అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం దాదాపు రూ 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ పాత్ర ఆయన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనిది.
కాబట్టే ఆయన వస్త్రాధారణ, వేశాధారణ పూర్తి భిన్నంగా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కాస్ట్యూంస్ హైలెట్ కానున్నాయని ఇప్పటికే చిత్రబృందం పలుమార్లు వెల్లడించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా..బాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ లాంటి వారు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం..మొట్టమొదటి పాన్ ఇండియన్ స్థాయిలో 5 ప్రధాన భాషలలో రూపొందుతున్న సినిమా కావడం గొప్ప విశేషం. అందుకే, ప్రతీ ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్ లాంటి వార్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సినిమా తర్వాత మళ్ళీ అలాంటి జోనర్‌లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.