Health Benefits: ప్రస్తుత కాలంలో ప్రజల జీవన విధానంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి సరైన సమయానికి తినడం నిద్రపోవడం వంటివి మానేస్తూ ఆలస్యంగా తినడం ఆలస్యంగా నిద్రపోవడం వంటివి అలవాటు చేసుకున్నారు అయితే ముఖ్యంగా తిండి విషయంలో కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి పోషకాహార పదార్థాలు కలిగినటువంటి తిండిని పూర్తిగా పక్కన పెట్టి ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
ఇక ఇటీవల కాలంలో చాలామంది రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఆ సమయంలో స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది పిజ్జా బర్గర్లు సమోసాలు చిప్స్ వంటివి రాత్రిపూట తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇలా రాత్రి పడుకోవడానికి ముందు ఈ విధమైనటువంటి స్నాక్స్ కనక తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. లేట్ నైట్ స్నాక్స్ అలవాటు వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. పడుకునే ముందు చిరుతిళ్ళు తినడం కారణంగా సెరోటోనిన్, మెలటోనిన్ వంటి నిద్రను నియంత్రించే హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రాదు.
ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల మనపై అధిక ఒత్తిడి కలిగి ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది అంతేకాకుండా రాత్రి సమయంలో జీర్ణ క్రియ రేటు తక్కువగా ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి స్నాక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. పడుకునే ముందు స్నాక్స్ తింటే శరీర బరువు అదుపు తప్పుతుంది. కేలరీలు కొవ్వుగా మారతాయి. దాంతో మీరు భారీగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు పడుకోవడానికి ముందు ఎలాంటి స్నాక్స్ తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.