Health Benefits: సహజ సిద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే పొన్నగంటి ఆకుకూరలో ఎంతో విలువైన ఔషధ గుణాలతో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పొన్నగంటి మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర. ఈ మొక్క ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలను గ్రహించిన మన పూర్వీకులు వారి రోజువారి ఆహారంలో ఉపయోగించారు.
ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో పొన్నగంటి ఆకు మరియు ఈ మొక్క ఆకుల నుంచి లభించే నూనెతో ప్రమాదకర మొండి వ్యాధులను సైతం అదుపు చేయవచ్చునని ఆయుర్వేద గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. కంటి చూపును కోల్పోయిన వారికి తిరిగి కంటి చూపును తెప్పించే అద్భుత అంతుచిక్కని ఔషధ గుణాలు పొన్నగంటి ఆకుల్లో ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
పొన్నగంటి ఆకులను పప్పు లేదా ఇతర వంటకాలతో కలిపి కాకుండా పొన్నగంటి ఆకుకూరను మాత్రమే ఫ్రై చేసుకుని చక్కని రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొన్నగంటి ఆకుకూరలో రైబోఫ్లెవిన్,బీటా కెరోటిన్, విటమిన్ ఏ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. కావున తరచూ ఈ ఆకుకూరను ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో విషపదార్థాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
శీతాకాలంలో ఎక్కువగా బాధించే ఆస్తమా, బ్రాంకైటీస్ , ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేయడానికి పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా తేనెను కలుపుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పొన్నగంటి తాజా ఆకుల రసంలో వెల్లుల్లి రసం కలుపుకొని సేవిస్తే పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని సేవిస్తే సెక్స్ సామర్థ్యం పెరగడంతో పాటు వీర్యకణాభివృద్ధి కూడా జరుగుతుంది. ఇలా పొన్నగంటి కూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.