Wed. Jan 21st, 2026

    Esha Gupta : ఈషా గుప్తా ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ రోజూ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. సాధారణ వస్త్రధారణ నుండి బికినీ ఫ్యాషన్‌ వరకు, ఆరు గజాల చీర చుట్టుకున్నా ఈషా తనదైన ఫ్యాషన్ స్టైల్స్ తో అందరిని అలరిస్తూనే ఉంటుంది .

    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit
    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit

    సందర్భం ఏదయినా ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తుంటుంది ఈ చిన్నది. ప్యాంట్‌సూట్‌లో ప్రొఫెషనల్ మీటింగ్‌కు హాజరవుతున్నప్పుడు లేదా స్విమ్‌సూట్‌లో పూల్ వద్ద స్నేహితులతో కూల్ గా గడిపినప్పుడు, ఈషా ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు ఫ్యాషన్ ప్రియులను అసూయ కలిగిస్తుంటాయి .

    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit
    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit

    ఇన్ స్టాగ్రామ్ లో ఈషా అప్లోడ్ చేసే ప్రతి ఫోటో ఫ్యాషన్ ప్రియులను నోట్స్ తీసుకోవడానికి తహతహలాడేలా చేస్తుంది. ఈషా తాజాగా చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలో ఒకదానిని ఇన్ స్టాలో పోస్ట్ చేసి హీట్ ను పెంచింది. అద్భుతమైన పింక్ ప్యాంట్ సూట్ ధరించి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందించింది .

    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit
    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit

    ఈషా గుప్తా, పింక్ ప్యాంట్‌సూట్‌లో తన తాజా పోస్ట్ ద్వారా, ప్యాంట్‌సూట్‌ను ఎలా రాక్ చేయాలో చూపుతుంది.ఈషా గుప్తా డీప్ నెక్‌లైన్‌ను కలిగి ఉన్న తెల్లటి బస్టియర్ టాప్ ధరించి, దానికి పింక్ ప్యాంట్‌సూట్‌తో జత చేసింది. అంతర్జాతీయ శ్రేణికి చెందిన బాస్ ఫ్యాషన్ లేబుల్ ప్యాంట్‌సూట్‌కు ఈషా గుప్తా తన స్టైల్ లో పూర్తి న్యాయం చేసింది. ఈషా గుప్తా క్రిస్టియన్ లౌబౌటిన్ యొక్క లగ్జరీ లైన్ నుండి చిక్ పర్స్‌ను తన రూపానికి జత చేసింది.

    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit
    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit

    ఈ ప్యాంట్ సూట్ ఈషా ఆకారాన్ని కౌగిలించుకుని ఆమె ఒంపులను చూపుతూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా పింక్ కలర్ ఫుట్వేర్ వేసుకుంది. మ్యాచింగ్ వాచ్ పెట్టుకుంది. తనహేర్ లీవ్ చేసుకొని క్రేజీ లుక్స్ తో కెమెరాకు ఫోజులిచ్చింది ఈ పిక్స్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit
    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit

    అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తన అందాలకు మెరుగులు దిద్దుకుంది ఈషా. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కర వేసుకుని, కనుబొమ్మలు గీసుకుని , పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని ఆదరగొట్టింది.

    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit
    esha-gupta-stunning-looks-in-amazing-pant-suit

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.