Health Tips: కూటి కోసం కోటి విద్యలు అన్నారు మన పెద్దవారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంపాదించడం కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉరుకులు పరుగులు జీవితంలో పయనిస్తూ ఉన్నారు. సరైన సమయానికి తిండి మానేసి మరి పనిపై ధ్యాస పెడుతున్నారు.ఇలా సరైన సమయానికి తిండి తినకపోవడం వల్ల మనము సంపాదించినది మొత్తం తిరిగి ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే సరైన సమయానికి తినడం ఎంతో ఉత్తమం.
ఇలా ప్రతిరోజు మనం సమయానికి భోజనం చేయటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఉదయం 8 గంటలకు టిఫిన్ తో ప్రారంభించి రాత్రి 8 గంటలకు భోజనంతో ముగిస్తే గుండె, రక్తనాళాలకు మేలు చేస్తున్నట్టు ఒక అధ్యయనంలో బయట పడింది. రోజులో తొలి భోజనం ఆలస్యమవుతున్నకొద్దీ ప్రతి గంటకూ 6% చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఉదాహరణకు ఎనిమిది గంటలకు తినాల్సినటువంటి టిఫిన్ 9 గంటలకు తినటం వల్ల వారిలో ఆరు శాతం గుండే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఈ విధమైనటువంటి గుండె సమస్యల నుంచి బయటపడటానికి సరైన సమయానికి భోజనం చేయడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి ఆహార అవసరాలు ఒక్కోలా ఉన్నప్పటికీ వేళకు తినటం, భోజనానికీ భోజనానికీ మధ్య తగినంత విరామం ఉండేలా చూసుకోవడం అవసరం. పడుకునే ముందు ఎక్కువగా తినకపోవటం ఉత్తమం. రాత్రి భోజనం తొందరగా ముగిస్తే తగినంత సేపు ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా దోహదం చేస్తుంది.