Coconut Water: కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందనే సంగతి మనకు తెలిసిందే. కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. ఈ పోషకాలని కూడా మన శరీరానికి తగినంత శక్తిని అందించడమే కాకుండా మనం ఎంతో చురుకుగా ఉండడానికి తోడ్పడుతుంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా కొబ్బరినీళ్లు తాగటం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఇలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ కొబ్బరి నీళ్లను మనం వేసవి కాలంలో విపరీతంగా తాగుతూ ఉంటాము. ఈ కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు మన దాహాన్ని తీర్చడంలో తోడ్పడతాయి అందుకే ఎక్కువగా వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇలా కొబ్బరి నీళ్లను తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ కొబ్బరి నీళ్లను కొన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కొబ్బరి నీళ్ల వల్ల కిడ్నీలో పొటాషియం స్థాయి పెరిగి ఈ అవయవం ఫిల్టర్ చేయలేకపోతుందని అంటున్నారు. ఎవరైనా కొబ్బరికి అలెర్జీ కలిగి ఉంటే అతను కొబ్బరి నీళ్ళు తాగకుండా ఉండాలి. అంతేకాదు ఇప్పటికే ఏ రకమైన అలెర్జీతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ ను సంప్రదించి కొబ్బరి నీళ్లు తాగటం ఎంతో ఉత్తమం.