Categories: EntertainmentLatest

Double Ismart : దిమాక్ కిరికిరి..డబుల్ ఇస్మార్ట్ టీజర్ అదుర్స్

Double Ismart : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ గతంలో వెండితెరపైన రచ్చ రచ్చ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్రాంచైజీలో వస్తున్న హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. రామ్ పోతినేని సహా ప్రముఖులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీతో ప్రేక్షకులకు డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఇవాళ హీరో రామ్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఓ రేంజ్ లో దుమ్ముదులుపుతోంది. మరోసారి రామ్, పూరి మ్యాజిక్ రిపీట్స్ అంటూ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

double-ismart-ram-pothineni-and-puri-jagannadh-magic-repeats

డబుల్ ఇస్మార్ట్ టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ టీజర్‌లో నీ యమ్మ అరై అంటూ.. రామ్ పోతినేని తెలంగాణ కుర్రాడి యాటిట్యూడ్ తో ఇరగదీశాడు. దిమాక్ కిరికిరి.. నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే అనే డైలాగ్‌తో తన క్యారెక్టర్ ను మరోసారి ఎలివేట్ చేశాడు రామ్. ఇస్మార్ట్‌కు మించి ఈ సినిమా ఉండబోతుందని, టీజర్ చూస్తే అర్థం అవుతుంది. డబుల్ మాస్, డబుల్ యాక్షన్.. డబుల్ ఎంటర్టైన్ మెంట్ పక్కా అని తెలుస్తోంది. ఈ సారి రామ్, పూరీ జగన్నాథ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా తెలుస్తోంది. లైగర్ అట్టర్ ఫ్లామ్ తర్వాత పూరీ కంబ్యాక్ ఇచ్చేందుకు ఈ సినిమా హెల్ప్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

double-ismart-ram-pothineni-and-puri-jagannadh-magic-repeats

ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలో ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.’డబుల్ ఇస్మార్ట్’ను పూరీ కనెక్ట్స్ బ్యానెర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు.

 

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.