AP BJP: ఏపీ రాజకీయాలలో ఇప్పటి వరకు కాంగ్రెస్ తర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఆయన సామర్ధ్యంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత అధిష్టానం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో విభజన ఆంధ్రప్రదేశంలో ఆ పార్టీ పూర్తిగా ప్రభావం కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి టర్న్ అయ్యింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు నడిపిన అందరూ జగన్ గూటికి చేరిపోయారు. ఇక తెలంగాణలో కూడా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో అగమ్యగోచరంగా ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకొని బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. రానున్న ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అయితే ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆ పార్టీకి సంస్థాగతంగా బలం లేదు. అలాగే అగ్రెసివ్ గా వెళ్లి ప్రజలని ఎట్రాక్ట్ చేసే నాయకత్వం కూడా లేదు. దీంతో బీజేపీ వైపు ఏపీ ప్రజలు చూసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జనసేనతో పొత్తు ద్వారా బలపడాలని కేంద్ర నాయకత్వం ఆలోచన చేసింది. అయితే రాష్ట్రంలో ఉన్న నాయకులు మాత్రం జనసేనతో కలిసి పనిచేయడంలోగాని పోరాటం లోగాని పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఎన్నికలు సమీపించే సమయానికి పవన్ కళ్యాణ్ తన సొంత అజెండాతో వెళ్ళడానికి రెడీ అయ్యారు. బీజేపీ నాయకులు బయటకి మాత్రం పవన్ తమతో ఉంటాడని చెబుతున్న రాజకీయ వర్గాలలో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది.
అలాగే బీజేపీలో బలమైన నాయకులుగా ఉన్న విష్ణు కుమార్ రాజు కూడా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. తాజాగా జనసేన, టీడీపీ కూటమితో కలిసి పనిచేస్తే బీజేపీకి ఏపీలో ఎన్నో కొన్ని స్థానాలు వస్తాయని చెప్పేశారు. అయితే సోము వీర్రాజు ఇప్పుడు అతనికి సోకాజు నోటీసులు ఇవ్వడం ద్వారా పొమ్మనకుండా పోగాపెడుతున్నారు అనే మాట వినిపిస్తోంది. అకాగే టీజీ వెంకటేష్ కొడుకు టీడీపీలో ఉన్నారు. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయిపొయింది. తాజాగా అతనికి కూడా షోకాజు నోటీసులు ఇచ్చారంట. ఉన్న ఒకరిద్దరు నాయకులని కూడా బీజేపీ ఇలాంటి పనులతో దూరం చేసుకుంటుంది అనే మాట వినిపిస్తోంది.