Saturday: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తుంటాము కొన్ని నమ్మకాలను కూడా ఎంతగానో విశ్వసిస్తూ ఉంటాము. ఇలా నమ్మకాలన్నింటినీ కూడా కొందరు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ రోజు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయాలి, ఎలాంటి దానాలు చేయాలనే విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది.
ఇలా శనివారం శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శని ప్రభావ దోషంతో బాధపడేవారు శనివారం శని దేవుడిని ప్రత్యేకంగా పూజలు చేసి పూజించడం వల్ల దోషం తొలగిపోతుందని చెబుతుంటారు. అయితే పొరపాటున కూడా శనివారం కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. తెలిసి తెలియక ఈ వస్తువులను కొనుగోలు చేస్తున్న భారీ మూల్యం చెల్లించక తప్పదు.
శనివారం పొరపాటున కూడా ఇనుముతో తయారు చేసిన ఏ వస్తువులను కొనుగోలు చేయకూడదు అలాగే అమ్మకూడదు. ఇనుము శనీశ్వరుడి రాకను సూచిస్తుంది కనుక ఆ రోజేటి పరిస్థితులలో కూడా ఇనుము కొనుగోలు చేయకూడదు అలాగే వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. అలాగే నల్లరంగు దుస్తులు,షూస్ వంటి వాటిని కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. ఆవనూనె నల్లటి నువ్వులు వంటి వాటిని కూడా ఎట్టి పరిస్థితులలోనూ శనివారం కొనుగోలు చేయకూడదు. ఇక శనివారం ఎవరికైనా నల్లటి వస్త్రాలు లేదా నల్లని నువ్వులను, నువ్వుల నూనెను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.