Dreams: నిద్రపోయిన తర్వాత చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కలలో కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని సార్లు భయపెట్టే సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. దీంతో భయపెట్టే కలలు వచ్చినపుడు తుళ్ళి పడి నిద్రలోంచి మేల్కొంటారు. ఇదిలా ఉంటే మనం నిద్రలో కనే కలని అంత ఈజీగా తీసేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కల వచ్చే సమయం బట్టి, కనిపించే దృశ్యం పట్టి వాటి ఫలితాలు ఉంటాయని కూడా చెబుతారు. అలాగే భవిష్యత్తులో మనకి జరగబోయే ఘటనలు కలల రూపంలో ముందుగానేక్ కనిపిస్తాయని మానసిక నిపుణులు చెబుతారు.
అయితే ఉదయం నుంచి మన జీవితంలో చూసిన సంఘటనలే మరల కలల రూపంలో వస్తాయని అంటారు. అయితే స్వప్న శాస్త్రంలో కలల గురించి కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాటిని చూసుకుంటే. మరణించినట్లు కల వస్తే అది శుభప్రదం అనే స్వప్నశాస్త్రం చెబుతుంది. మరణాన్ని చూసేవారికి ఆకస్మిక డబ్బు వస్తుందని, భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే కలలో ఫ్రూట్స్, పువ్వులు కనిపిస్తే శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
వాటిని చూస్తే మన మనస్సులో కోరిక త్వరలో నెరవేరుతుంది అని అర్ధం. ఇక పర్వతాలు ఎక్కుతున్నట్లు కలలు వస్తే జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబోతున్నాయని అర్ధం. ఆర్ధిక వృద్ధి జరుగుతుందని సూచిస్తుంది. గుడ్లగూబలు కలలో వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది. అలాగే వర్షంలో తడుస్తున్నట్లు, వర్షం వచ్చినట్లు కల వస్తే జీవితంలో సంతోషం పెరుగుతుందని, అలాంటి సంఘటనలు ఎదురవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది.