Pestle: సాధారణంగా మనం ఏ శుభకార్యం చేసిన హిందూ సంప్రదాయాల ప్రకారం చేస్తూ ఉంటాము. ముఖ్యంగా వివాహ సమయంలో ప్రతి ఒక్క కార్యం కూడా ఎంతో సాంప్రదాయ బద్ధంగా చేస్తూ ఉంటారు. అయితే పెళ్లిలో చాలామంది ఇప్పటికీ రోలు రోకలి తిరగలికి పూజ చేస్తూ ఉంటారు. ఇలా కొన్నిచోట్ల ఈ సాంప్రదాయం పెళ్లిలో ఉంటుంది. మరి ఇలా పెళ్లిలో వీటికి పూజ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
పూర్వకాలంలో ఏదైనా పెళ్లి పనులు ప్రారంభించాలి అంటే ముందుగా పెళ్ళికి సరిపడే దాన్యం మొత్తం రోలు రోకలిలో దంచుకుని సిద్ధం చేసుకునేవారు .అలాగే పిండి వంటి వాటిని కూడా తిరగలిలో తయారు చేసుకునేవారు ఇలా పెళ్లికి సంబంధించిన పనులను ప్రారంభించడానికి ముందు వీటికి పూజ చేస్తే ధాన్యాలను సిద్ధం చేసుకునేవారు అందుకే పెళ్లిలో తప్పనిసరిగా రోలు రోకలికి అప్పట్లో పూజ చేసేవారు కానీ ప్రస్తుత కాలంలో మార్కెట్లో మనకి అన్ని కూడా రెడీమేడ్ దొరుకుతున్నాయి కనుక చాలామంది ఈ సాంప్రదాయాన్ని మర్చిపోయారు.
ఇక కొన్నిచోట్ల మాత్రమే ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. పసుపు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుగా రోలు రోకలికి పూజ చేసి పసుపును దంచి పెళ్లి పనులను ప్రారంభిస్తున్నారు. ఇలా పెళ్లిలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ సంప్రదాయాన్ని మరవకుండా పాటిస్తూ ఉన్నారు. రోకలి, రోలును సాక్షాత్తు లక్ష్మీనారాయణ గా భావిస్తారు.అలాగే తిరగలని శివుడి గాను అందులో నుంచి వచ్చే పిండిని పార్వతి దేవి గాను భావిస్తారు కనుక ఇప్పటికీ ప్రాంతాలలో పూజలు చేస్తూ పెళ్లి పనులను చేస్తుంటారు.