Lord Ganesh: ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకోగా మరికొన్ని చోట్ల ఐదు 11 రోజులపాటు ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఎలా ఇన్ని రోజులపాటు వినాయకుడికి ప్రత్యేకంగా పూజలను అందించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా వినాయక చవితి అనంతరం స్వామి వారి విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే విషయానికి వస్తే…
వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. వినాయకుడికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకడం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి కూడా చేరుతుంది. ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఔషధ గుణాలు కూడా చేరుతాయి. ఇక తొమ్మిది రోజుల తర్వాత స్వామి వారిని నిమర్జనం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే వినాయక చవితి పండుగ సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవటం వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి.
ఇలాంటి సమయంలో తీరం వెంబడి వినాయకుడి ప్రతిమలను నిమర్జనం చేయటం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు. నిమజ్జనంలో విడిచే ప్రతిమతో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుంది అన్న ఉద్దేశంతోనే వినాయక చవితి విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. అయితే ప్రస్తుత కాలంలో మట్టి విగ్రహాలను కాకుండా ఎన్నో రసాయనాలు ఉపయోగించి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నిమర్జనం చేయటం వల్ల మీరు మరింత కలుషితం అయ్యే ప్రమాదాలు ఉన్నాయి.