Coconut: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమాలు జరిగిన శుభకార్యం జరిగిన కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఆలయానికి వెళ్ళిన వారందరూ కూడా కొబ్బరికాయ తీసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఇలా కొబ్బరికాయ కొట్టడం అనేది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పగల కొట్టడమే అని అర్థం. అయితే చాలామంది ఏదో ఒక సందర్భంలో కొబ్బరికాయ కొడుతూ ఉంటాము ఇలా కొట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
ఇక కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కుళ్లిపోతుంది ఇలాంటి సమయంలో కూడా చాలామంది మనం అనుకున్న పని జరుగుతుందో లేదో ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఏంటి అంటూ బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోయిన పెద్దగా బాధపడాల్సిన పనిలేదని ఈ చిన్న పరిహారం చేస్తే దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయ మొత్తం కడిగి కొబ్బరికాయ జుట్టు వెనుక భాగం పట్టుకొని కొట్టాలి కొబ్బరికాయ రెండు సమభాగాలుగా పగిలితే ఎంతో మంచిది.
అయితే కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతుంటుంది ఇలా కుళ్ళిపోయిన సమయంలో ఏదైనా ఆశుభం జరుగుతుంది ఏమోనని కంగారు పడుతుంటారు. అయితే అలా కంగారు పడాల్సిన పనిలేదని వెంటనే కాళ్లు మొహం కడుక్కొని దాని స్థానంలో మరొక టెంకాయ కొట్టి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల ఏ విధమైనటువంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు.