Kaarthika Masam: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే మాసాలలో కార్తీకమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున శివ కేశవులను పూజిస్తూ ఉంటారు ఇక ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు కూడా చేస్తూ ఉంటారు. ఇక కార్తీకమాసంలో ప్రతి ఒక్కరు కూడా శివకేశవులతో పాటు తులసిమాతను కూడా ఆరాధిస్తూ ఉంటారు.
కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పెళ్లి కాని వారు పెళ్లి కావడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఇలా పెళ్లి సంబంధాలు కుదరని వారు కార్తీకమాసంలో తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల త్వరగా పెళ్లి సంబంధం కుదురుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున తులసి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయడమే కాకుండా వివాహం కూడా జరిపిస్తారు. కార్తీకమాసంలోనే తులసి వివాహం జరిగినది కనుక ఈ మాసంలో పెళ్లి కాని వారు తులసి మొక్కను ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల వారికి కూడా తొందరగా పెళ్లి అవుతుందని పండితులు చెబుతున్నారు.
అమ్మాయిలకు తగిన వరుడు దొరకాలి అంటే కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి రోజు తులసి కళ్యాణం తప్పకుండా జరిపించడం వల్ల వారికి కూడా వివాహ గడియలు దగ్గర పడతాయి చక్కని వరుడు వస్తారు. అలాగే ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించి పూజ చేయడం వల్ల దోష పరిహారాలు పోవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. ఇక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు లేదా పౌర్ణమి రోజు తులసి చెట్టుకు ఎర్రచందనం సమర్పించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.