Food Eating: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు కూడా సరైన సమయానికి భోజనం చేయడం లేదు భోజన సమయం దాటిపోయిన తర్వాత వారికి వీలు కుదిరినప్పుడు భోజనం చేస్తూ ఉంటారు అయితే రాత్రి సమయంలో కూడా చాలామంది ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. రాత్రికి తొమ్మిది గంటల తర్వాత భోజనం కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రికి భోజనం 9 గంటల తర్వాత తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది జీర్ణ శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. ప్రతిరోజూ రాత్రుళ్లు ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారికి అది భవిష్యత్తులో స్ట్రోక్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు, షుగర్ లెవల్స్‌లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే రాత్రిపూట కనక మనం ఆలస్యంగా భోజనం చేస్తే అధిక శరీర బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే కేవలం మనం సరైన సమయానికి భోజనం చేయడం ఎంతో మంచిది ముఖ్యంగా రాత్రి 8 గంటల లోపు భోజనం చేయడం ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతున్నారు.