Lord Shani: అభిషేక ప్రియుడు అయినటువంటి పరమేశ్వరుడికి వివిధ రకాల పత్రాలు పుష్పాలతో అభిషేకాలు చేస్తూ ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. అయితే పరమేశ్వరుడికి బిల్వదళాలతో కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే బిల్వదలతో శివుడికి ఎందుకు పూజ చేయాలి? బిల్వపత్రాలతో శనీశ్వరుడిని పూజించటం వల్ల శని బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. బిల్వదలాలకు శనీశ్వరునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్నికి వస్తే…
ఒకరోజు శనీశ్వరుడు శివపార్వతుల దర్శనార్థం కైలాసానికి వెళ్తారట అయితే అక్కడ శని విధి నిర్వహణ లను పరీక్షించాలన్న ఉద్దేశంతో పరమేశ్వరుడు నీవు అందరిని పడుతుంటావు కదా నన్ను కనిపెట్టుకొని నేను ఎక్కడున్నానో గుర్తించు అంటూ పరమేశ్వరుడు పరీక్ష పెడతారు దాంతో రేపు ఉదయం నుంచి సాయంత్రంలోగా నేను మిమ్మల్ని తప్పకుండా పట్టుకుంటాను అంటూ శని చెప్పడంతో మరుసటి రోజు ఉదయం పరమేశ్వరుడు కైలాసం వదిలి బిల్వ వృక్షంగా మారిపోతాడు. పరమేశ్వరుడి జాడ తెలియక శనితో పాటు దేవతలందరూ కూడా గాలిస్తూ ఉంటారు.
ఇలా సాయంత్రం అయినప్పటికీ శనీశ్వరుడు తనని గుర్తించకపోవడంతో బిల్వవృక్షం నుంచి పరమేశ్వరుడు బయటకు వస్తాడు. పరమేశ్వరుడు రావడంతో వెంటనే శనీశ్వరుడు కూడా ప్రత్యక్షమవుతాడు నన్ను పట్టుకోలేకపోయావు కదా శని అని పరమేశ్వరుడు చెప్పడంతో నేను పట్టుకోకపోవటం వల్లే కదా మీరు ఉదయం నుంచి బిల్వ వృక్షంలో ఉన్నారని చెప్పగా శనీశ్వరుడి విధి నిర్వహణకు ముగ్ధుడైన పరమేశ్వరుడు తనని శనీశ్వరుడుగా పిలిచారు. అప్పటినుంచి శనిని శనీశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు. అలాగే ఎవరికైతే శని బాధలు ఉంటాయో అలాంటివారు తనకు బిల్వ దళాలతో పూజ చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయని పరమేశ్వరుడు చెప్పారు. అందుకే శని బాధలు తొలగిపోవాలి అంటే బిల్వ దళాలతో పరమేశ్వరుడికి పూజ చేయాలని పండితులు చెబుతుంటారు.