Tue. Nov 18th, 2025

    Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్‌ లు వారి వారి జీవితాల్లో , కెరీర్ లో ప్రస్తుతం బిజీగా ఉంటున్నారు. భార్య భర్తలుగా సుమారు 18 ఏళ్ల నాటి వీరి రిలేషన్ బ్రేక్ అయ్యిందని వీరిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నట్లు 2022లోనే అనౌన్స్ చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. డివోర్స్ కోసం అప్లై చేస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరి ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. అయితే ఆ మధ్య మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారని ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ కూడా ఈ జంట కలిసిపోవాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ఈ జంట దూరంగానే ఉంటోంది. ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్ తన తండ్రితో కలిసి లాల్ సలామ్‌ సినిమాను తెరకెక్కిచింది. మరోవైపు ధనుశ్‌ రాయన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే లేటెస్టుగా ఈ జంట చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఆఫీషియల్ గా డివోర్స్ కోసం అప్లై చేసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు త్వరలో వారి కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. దీంతో మరోసారి ధనుశ్- ఐశ్వర్య లు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారారు.

    dhanush-officially-applied-for-divorce-in-chennai-family-court
    dhanush-officially-applied-for-divorce-in-chennai-family-court

    తమ విడాకులపై స్టార్ హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా అప్పట్లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ తో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది. ” 18 ఏళ్ల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా ఉన్నాం. ఈ రోజు మా దారులు వేరయ్యాయి. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరిలైఫ్ వారు బ్రతకాలను కుంటున్నాము. మా నిర్ణయాన్ని గౌరవిస్తారని, ఈ విషయంలో మాకు కాస్త ప్రైవసీని ఇస్తారని ఆశిస్తున్నాను.” అంటూ ధనుష్‌ ఇన్ స్టక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేశారు. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఈ పోస్ట్ మరోసారి ఇవాళ వైరల్ అవుతోంది.

    dhanush-officially-applied-for-divorce-in-chennai-family-court
    dhanush-officially-applied-for-divorce-in-chennai-family-court

    2004లో ధనుశ్, ఐశ్వర్య ల పెళ్లి జరిగింది. వీరికీ యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంతా బాగానే 18 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. లేటెస్టుగా వీరి డివోర్స్ అనౌన్స్ మెంట్ రావడంతో ధనుశ్- ఐశ్వర్య టాపిక్‌ మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రొఫెషన్ విషయానికి వస్తే ఐశ్వర్య తన తండ్రితో ‍’లాల్ సలామ్‌’ మూవీ ను తెరకెక్కించింది. ధనుశ్‌ ‘రాయన్’మువీ చేస్తున్నాడు.