Dhanatrayodashi: కార్తీక మాసంలోని కృష్ణపక్షం త్రయోదశి రోజు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ధన త్రయోదశి పండుగ రోజు కూడా పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజ చేయడం చేస్తుంటారు అలాగే ఈరోజు బంగారం కొనడం కూడా ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనే అంత స్తోమత ఉండదు కనుక బంగారంతో పాటు ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను కొనుగోలు చేసిన అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ధన త్రయోదశి రోజు బంగారంతో పాటు ఇంకా ఏ వస్తువులను కొనడం శుభ ఫలితమో ఇక్కడ తెలుసుకుందాం..
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి వారు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ధన త్రయోదశి రోజు ఉప్పు కొనుగోలు చేయడం ఎంతో మంచిది. ఇక ఉప్పుతో పాటు ధన త్రయోదశి రోజు చీపురును కొనడం కూడా శుభ సంకేతం ఇలా ధన త్రయోదశి రోజు చీపురిని కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ రెండింటిని మాత్రమే కాకుండా ధన త్రయోదశి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గోమతి చక్రాలను కూడా కొనుగోలు చేయటం ఎంతో మంచిది.
ఇక ధన త్రయోదశి రోజు కొత్తిమీర లేదా ధనియాలను కూడా కొనుగోలు చేయడం శుభపరిణామం అని పండితులు చెబుతున్నారు. ఇలా బంగారం కొనలేని వారు ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను కొనుగోలు చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఎంతో అనుకూలమవుతాయని, మీ ఇంట సిరి సంపదలు రావటానికి కారణం అవుతాయని పండితులు తెలుపుతున్నారు.