Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం చాలామంది ఏదైనా ఉపవాస సమయంలోను పండుగలు సమయంలోను పెద్ద ఎత్తున దానధర్మాలను చేస్తుంటారు. ఇలా దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుందని భావిస్తారు. అయితే వేసవికాలంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అదృష్ట దేవత మన ఇంట్లో తిష్ట వేస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ వస్తువులను దానం చేసినప్పుడు నలుగురికి చెప్పి దానం చేయకూడదు. ఈ వస్తువులను రహస్యంగా దానం చేయటం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి.
దానం చేయాల్సిన వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే… మనం పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పండ్లు పెట్టడం సర్వసాధారణంగా చేసే పని అయితే పూజ తరువాత స్వామివారి నైవేద్యంగా ఆ పండ్లను తిరిగి తీసుకొని ఇతరులకు ప్రసాదంగా పంచుతుంటాము.అయితే ఈ పనులను ఎప్పుడు కూడా కట్ చేసి ఇతరులకు ఇవ్వకూడదు పూర్తి పండును ఇతరులకు ఇవ్వటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జల దానం కూడా ఎంతో మంచిది. వేసవిలో ఇతరుల దాహాన్ని తీర్చడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది.
Devotional Tips:
బెల్లం కూడా దానం చేయడం ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. ఎవరైతే వేసవిలో రహస్యంగా బెల్లం దానం చేస్తారో అలాంటి వారి జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. అదేవిధంగా పెరుగును దానం చేయటం వల్ల జాతకంలో శుక్రుని స్థానం బలపడుతుంది. అందుకే ఈ పదార్థాలను వేసవిలో రహస్యంగా దానం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.