Devotional Tips: మన భారతీయ సంస్కృతిలో దేవుళ్లతో పాటు కొన్ని రకాల మొక్కలను కూడా భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు. అలా పూజించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. ముఖ్యంగా హిందూ ప్రజలు తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రతిరోజు ఉంటారు. ఇంటిలో తులసి మొక్కను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో ఈ మొక్కకు నీరు సమర్పించి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే నెలలో రెండు రోజులు తులసి మొక్కకు నీరు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అగ్రహానికి గురై కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ రోజులలో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆదివారం తులసి మొక్కకు నీరు సమర్పించటం మంచిది కాదు.తులసి మొక్క శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలత, ఆనందాన్ని తీసుకురావడానికి ప్రతిరోజూ ఒక తులసి మొక్కకు నీరు సమర్పించాలని చెబుతారు. కానీ ఆదివారం రోజు మాత్రం తులసి మాతకు నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఆదివారం రోజు తులసీమాత మహావిష్ణువు కోసం నిర్జ వ్రతాన్ని ఆచరిస్తుంది. నీటిని సమర్పించడం వలన ఆమె ఉపవాసం భంగం అవుతుందని నమ్ముతారు. అందువల్ల ఆదివారం రోజు తులసిమాతకు నీరు సమర్పించకూడదు.
Devotional Tips:
అలాగే ఏకాదశి రోజున కూడా తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. ప్రతి ఏకాదశి నాడు తులసీమాత విష్ణువు కోసం నీళ్లు తీసుకోకుండా వ్రతం ఆచరిస్తుంది.కాబట్టి ఏకాదశి నాడు తులసికి నీరు సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. పొరపాటున ఆదివారం రోజున ఏకాదశి రోజున తులసిమాతకు నీరు సమర్పించితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.