Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం గుడిలోకి ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుడిలో ఉన్నటువంటి గంటను కొట్టి దేవుని నమస్కరించుకుంటారు. ఇలా దేవుడికి గంట కొట్టడం ద్వారా మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆలయంలోకి వెళ్లగానే గుడి గంట కొట్టి స్వామి వారిని దర్శించుకుంటాము.
ఈ విధంగా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత గుడి గంట కొట్టి దేవుడిని నమస్కరించుకొని రావడం సర్వసాధారణంగా చేసే అంశం కానీ చాలా మంది గుడి నుంచి ఇంటికి వచ్చే సమయంలో కూడా గంట కొట్టి ఇంటికి బయలుదేరుతారు. ఇలా ఆలయం నుంచి వెనతిరిగిన సమయంలో గుడిగంట ఎందుకు కొడతారు అనే విషయానికి వస్తే… గుడిలోకి ప్రవేశించిన సమయంలో గంట కొట్టడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు.
Devotional Tips:
స్వామివారిని దర్శించుకుని మన కోరికలు అన్ని స్వామివారి ముందు చెప్పి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టడం వల్ల మీరు కోరుకున్నటువంటి కోరికలు స్వయంగా దేవుడి వద్దకు చేరుతాయి. దీంతో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలా ఆలయంలోకి వెళ్లిన తర్వాత ఆలయం నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా గంట కొట్టడం ఆనవాయితీగా మారింది. ఇక ఇంట్లో కూడా పూజ ప్రారంభించిన సమయంలోను అలాగే పూజ పూర్తి చేసుకున్న తర్వాత కూడా గంట కొట్టి మంగళహారతి ఇస్తుంటారు. ఇలా ఇవ్వటం వల్ల ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి నెగటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి అందుకే ఇంట్లో దీపారాధన సమయంలో గంట కొట్టడం ఎంతో మంచిది.