Eating Non Veg: చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు ఇలా ప్రతిరోజు. చాలామంది మాంసాహారాన్ని ఆహారంలో భాగంగా చేసుకుని తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఆహారంలో భాగంగా మాంసాహారం కనుక తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రతిరోజు ఆహారంలో భాగంగా మాంసం తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయానికి వస్తే.. మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్యతో పాటు జీర్ణ క్రియ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి.
ఇక మాంసంలో ఫైబర్ ఏ మాత్రం ఉండదు అందుకే జీర్ణక్రియ సమస్యలతో పాటు మలబద్ధక సమస్య కూడా తలెత్తుతుంది. ఇలా మాంసాహారం అధికంగా తీసుకునే వారు తొందరగా శరీర బరువు పెరగడమే కాకుండా ఊబకాయానికి కూడా దారితీస్తుంది. మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపించడంతో తొందరగా అలసిపోయినట్టు కనిపిస్తారు. ఇలా కాల్షియం లోపించడం ఎముకలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
Eating Non Veg:
ఇలా ఎక్కువగా మాంసాన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇకపోతే శరీర బరువు పెరిగి ఉబకాయానికి కారణమైన అనంతరం కొన్నిసార్లు క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు మాంసాహారాన్ని తగ్గించడం మంచిది.మాంసాహారం తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి కానీ అతిగా తినటం వల్ల కలిగే ప్రయోజనాలు కన్నా జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటాయి.