Devotional Tips: మన హిందూ సంప్రదాయంలో తులసి చెట్టును చాలా పవిత్రంగా భావించే ప్రతిరోజు పూజిస్తారు. అంతే కాకుండా దేవుడి పూజలో కూడా తులసి దళాలను ఉపయోగిస్తారు. తులసి ఆకులతో మాలలు చేసి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. అయితే వినాయకుడి పూజలో మాత్రం పొరపాటున కూడా తులిసి దళాలు సమర్పించకూడదు. సాధారణంగా ఏ పూజ చేసినా కూడా మొదటగా వినాయకుడికి తొలి పూజ చేసిన తర్వాతనే మిగిలిన దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. ప్రారంభించిన పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విగ్నేశ్వరుడిని మొదటగా పూజిస్తుంటారు.
అంతేకాకుండా ప్రతి బుధవారం రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల జీవితంలో ఎదురైన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే వినాయక పూజలో రకరకాల మోదకాలతోపాటు కుంకుమ, అక్షతలు, దర్భలు, పువ్వలు, సుగంధ ద్రవ్యాలు, సింధూరం వంటివన్నీ ఉపయోగిస్తారు. కానీ తులసిని మాత్రం గణేష పూజకు ఉపయోగించరు..ఎందుకంటే..తులసీ దేవి గణపతి అందమైన రూపానికి ఆకర్శితురాలవుతుంది. గణేషుని వివాహమాడాలనే కోరిక మనసులో కలిగింది పురాణాలు చెబుతున్నాయి.
Devotional Tips:
తులసి కోరిక వల్ల గణపతి తపోభంగం అయ్యి.. తాను బ్రహ్మచారినని,గణపతి ఆమె కోరికను తిరస్కరించాడు. దీంతో తులసికి కోపం వచ్చి దీర్ఘకాలం పాటు బ్రహ్మచారిగా ఉండిపొమ్మని శపిస్తుంది.వినాయకుడికి కూడా కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని,అతడి చరలో ఉండిపోతావని శపిస్తాడు. గణేష శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది. అయితే తులసి పాతివ్రత్య మహత్మ్యం వల్ల విష్ణుమూర్తి అతనిని సంహరించలేడు. దీంతో వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి.. మొక్కగా అవతరిస్తుంది. ఇలా ఇద్దరి మధ్య వైరం ఉండటం వల్ల వినాయకుడి పూజలో తులసి దళాలను ఉపయోగించరు.