Rainy season: ప్రస్తుతం వేసవికాలం నుంచి వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నటువంటి తరుణంలో వాతావరణంలో మార్పులు కూడా మొదలయ్యాయి. ఒకవైపు వర్షం కురుస్తుండగానే మరోవైపు ఉక్క పోత ఎండ తీవ్రత కూడా ఉంది. ఇక ఇటీవల వర్షాలు బాగా పడటంతో పెద్ద ఎత్తున ఇంటి పరిసర ప్రాంతాలలో మొక్కలు పెరగడం లేదంటే నీరు నిలవడం వంటివి జరుగుతున్నాయి .తద్వారా దోమలు పెరుగుదలకు కూడా అధికమౌతోంది. ఇలా దోమలు ఎక్కువగా రావడం వల్ల డెంగ్యూ మలేరియా వ్యాధులు కూడా అధికమవుతున్నాయి.
ముఖ్యంగా దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను కూడా మనం చూసాము. ఈ క్రమంలోనే దోమలు బారిన పడకుండా ఇంట్లో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి కూడా మనం బయటపడవచ్చు. మన ఇంటి చుట్టు కాలి స్థలం ఉన్నట్లయితే అక్కడ ఎలాంటి పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీ ఇంటి ఆవరణంలో పూల మొక్కలను కనుక పెట్టుకున్నట్లయితే వీలైనంతవరకు పూల మొక్కలు ఉన్నచోట శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే నీరు నిలవడానికి వీలు లేకుండా చేసుకోవాలి.
ఇలా మన ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉంటే కనుక దోమలు వృద్ధి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఇంట్లోకి దోమలు రాకుండా సాయంత్రం ఆరు గంటలకి డోర్లు మొత్తం మూసివేయాలి. ఇక విండోలకు వీలైనంతవరకు నెట్ వేసుకోవడం చాలా ఉత్తమం. ఇక రాత్రి పడుకునే సమయంలో తప్పనిసరిగా దోమ తెర్లను ఉపయోగించటం వల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉండగలం అలాగే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులను కూడా పూర్తిగా అరికట్టవచ్చు.