Deepika-Ranveer : బాలీవుడ్ తారల లవ్ అఫైర్లు, బ్రేకప్పులు, రిలేషన్స్, డివోర్సుల గురించి ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటుంది. నిత్యం బాలీవుడ్ తారలు ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. చోటామోట తారలే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు, సీరియర్ నటులు సైతం నెట్టింట్లో ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్, దీపిక పదుకొణె వంటి సెలెబ్రిటీల అఫైర్లు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఎన్ని లవ్ అఫైర్లు కొనసాగించినా, బ్రేకప్ అయినా చివరకు రణ్‌బీర్ కపూర్ అలియా భట్‌లు పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ మధ్యనే తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఇక బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణెలు కూడా పెళ్లి బంధంతో కలిసిపోయిన విషయం తెలిసిందే. కత్రినా కైఫ్ ఎట్టకేలకు తనను ప్రేమించిన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ సెలబ్రిటీలందరికీ బ్యాక్ గ్రౌండ్ లో భయంకరమైన గతాలు, బ్రేకప్‌లు, లవ్ స్టోరీలు ఉన్నాయి. అవన్నీ మరిచిపోయి వారి ప్రజెంట్ లైఫ్ లో చాలా ఆనందంగా గడుపుతున్నారు.
అయితే లేటెస్టుగా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు తమ యానివర్సరీ సందర్భంగా బాలీడుడ్ ఫేమస్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8కు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. వీరిద్దరు కరణ్ షోకు రావడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ వీరిద్దరే కరణ్ షోలో పాల్గొన్నారు. అయితే గతంలో రణ్‌వీర్ నటి అనుష్క శర్మ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో.. అప్పుడు ఆమె గురించి ఏం చెప్పాడో లేటెస్టు ఎపిసోడ్ లో దీపిక పదుకొణె విషయంలోనూ అవే కామోట్లు చేశాడు. తన డైలాగులు మారలేదు కానీ జస్ట్ పేరు మాత్రం మారింది. దీంతో రణ్ వీర్ అడ్డంగా బుక్ అయ్యాడు. నెటిజన్స్ కు మంచి వార్త దొరికినట్లైంది. దీంతో వీరు ఊరుకుంటారా చెప్పండి రణ్‌వీర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఇక దీపిక మాట్లాడిన మాటలు అయితే నెట్టింట్లో దారుణంగా ట్రోల్ అవుతున్నాయి.
గతంలో దీపిక కరణ్ షోలో డేటింగ్ అంటే ఏంటో తెలియదని, అసలు అదంటే ఇష్టం లేదన్నట్టుగా కామెంట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం గతంలో తాను నలుగురైదుగురితో డేటింగ్ చేశానని అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అంతే కాదు ఆ రిలేషన్స్ నుంచి బయటపడిన తర్వాత వాటి అనుభవాల నుంచి బయటపడేందుకు కొన్నేళ్లు ఒంటరిగా ఉండాలని అనుకుందట. ఆ సమయంలోనే రణ్‌వీర్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది. దీంతో రణ్‌వీర్‌కు తాను కమిట్ అయ్యానని దీపిక కరణ్ షోలో తన ఇన్నర్ ఫీలింగ్స్ ను బయటపెట్టింది.
అంతే కాదు ఒకసారి ఒకరికి కమిట్ అయ్యాము అంటే , ఎవరిని చూసినా.. ఎవరు నచ్చినా, ఎగ్జైట్ అయినా కూడా మన మనసులో మాత్రం కమిట్ అయిన వ్యక్తే కనిపించాలని, ఉండాలని తెలిపింది. అలా తనకు తన హృదయంలో , మైండ్‌లో ఎప్పుడూ రణ్‌వీర్ ఉంటాడని, రణ్‌వీర్‌కే తాను కమిట్ అయ్యాయని తెలిపింది. దీంతో దీపికపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నువ్వు ఇన్ని లవ్ స్టోరీలు , ఎఫైర్లు నడిపావ్ కాబట్టే రణ్‌బీర్ వదిలేశాడని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇకమరికొంత మంది రణ్‌బీర్ కపూర్ బ్రేకప్పుల లిస్టును సైతం నెటిజన్లు మెళ్లిగా బయటకు లాగుతున్నారు.