Health care: ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి తన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండడం కోసం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తల్లులు పోషకాహారం తీసుకున్నప్పుడే బిడ్డ ఎదుగుదల కూడా మంచిగా ఉంటుందని డాక్టర్లు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు.
ఇకపోతే పిల్లలు పుట్టిన తర్వాత పాలిచ్చే విషయంలో కూడా తల్లులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటున్నామో అదే ఫుడ్ పాల రూపంలో పిల్లలకు వెళుతుంది కనుక తప్పనిసరిగా బేబీ పుట్టిన తర్వాత కూడా తల్లులు ఎంతో మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు వెంటాడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇకపోతే చాలామంది పాలిచ్చే తల్లులకు కొన్ని ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. వారు ఎక్కువగా స్వీట్స్ తినాలని కోరుకుంటారు. అలాగే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తినడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇలా పాలిచ్చే తల్లులు ఇలాంటి ఫుడ్డు తీసుకోవడం మంచిదేనా అంటే అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్వీట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన శిశువు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వారు తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.