Sleeping: సాధారణంగా మనం నిద్రపోయే సమయంలో మనకు ఎలా పడుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందో అదే విధంగానే నిద్రపోతూ ఉంటాము. చాలామందికి నిటారుగా పడుకోవడం అలవాటు ఉంటుంది మరికొందరికి ఒకే వైపు తిరిగి పడుకోవడం అలవాటు ఉండగా మరికొందరు శరీరం మొత్తం ఒకచోటకు ముడుచుకొని నిద్రపోతూ ఉంటారు ఇక చాలామంది బోర్లా పడుకొని కూడా నిద్రపోతూ ఉంటారు ఇలా వారికి ఏ విధంగా పడుకుంటే సౌకర్యంగా ఉంటుందో అదే బంగిమలోనే నిద్రపోతూ ఉంటారు.
ఇక చాలామంది ఏదైనా పనిచేసి అలసిపోయినప్పుడు ఎక్కువగా బోర్ల పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే బోర్ల పడుకొని నిద్రపోతూ ఉంటారు అయితే ఇలా బోర్లా పడుకొని నిద్రపోవటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి బోర్ల పడుకోవడం వల్ల వచ్చే ఆ సమస్యలు ఏంటి అని విషయానికి వస్తే..
బోర్లా నిద్రపోవటం వల్ల శ్వాస తీసుకోవడానికి మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది అందుకే బోర్లా పడుకోకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు అంతేకాకుండా మన బెడ్ షీట్ కి లేదా బెడ్ కు ఉన్నటువంటి దుమ్ము మన నాసికా రంద్రాల ద్వారా వెళ్లి దగ్గు అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు బోర్ల పడుకోవడం వల్ల కడుపుపై అధిక ఒత్తిడి కలగడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా తేలికగా జీర్ణం కాకుండా ఉంటుంది తద్వారా మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి అందుకే బోర్లా పనుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే మార్చుకోవడం మంచిది.