Coconut: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగింది అంటే తప్పకుండా ఆ శుభకార్యాలలో కొబ్బరికాయల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది.ఇలా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఏదైనా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలన్న తప్పకుండా కొబ్బరికాయ కొట్టి మంచి పనులను ప్రారంభిస్తాము అలాగే మనం చేస్తున్నటువంటి కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని భావిస్తాము.
ఈ విధంగా శుభకార్యాలు చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కనుక కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలామంది ఎంతో ఆందోళన చెందుతుంటారు. మనం చేసే కార్యంలో ఏదైనా ఆటంకాలు కలుగుతాయో అనే కంగారు అందరిలోనూ ఉంటుంది అయితే ఇలా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించే ముందు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదని వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మరొక కొబ్బరికాయ కొడితే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే కొబ్బరికాయలో కొన్నిసార్లు పువ్వు కూడా వస్తుంది.
Coconut:
ఇలా కొబ్బరికాయలు పువ్వు రావడం దేనికి సంకేతం పువ్వు వస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే ఎవరైతే దేవుడిని నమస్కరించుకొని కొబ్బరికాయ కొడతారో అలాంటి సమయంలో కొబ్బరికాయలో కనుక పువ్వు వస్తే త్వరలోనే ఆ ఇంట్లో సంతానయోగం కలుగుతుందని అర్థం. ఇలా పువ్వు రావడానికి శుభసంకేతంగా పరిగణిస్తారు. ఇక దేవుడు ముందు కొబ్బరికాయ కొట్టడం మన శరీరంలోని అహంకారాన్ని కూడా పగల కొట్టడానికి సంకేతంగా భావించి కొబ్బరి కాయను కొడుతూ ఉంటారు.