Categories: HealthLatestNews

Finger millet biscuits: కొబ్బరి రాగి బిస్కెట్లు

Finger millet biscuits:  అత్యంత సులభమైన, రుచికరమైన, తక్కువ సమయంలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకుండా తయారు చేసుకునే ఫుడ్ ఐటమ్ కొబ్బరి రాగి బిస్కెట్లు. క్రంచి గా, టేస్టీ గా ఉండే ఈ హెల్తీ లో ఫ్యాట్ డైట్ బిస్కెట్ లను పసి పిల్లలు, ఎదిగే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. విత్ ఎగ్ , వితౌట్ ఎగ్ బిస్కెట్ లను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.

ఒకసారి పిండిని కలుపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావలసినప్పుడు రెడీ గా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా వీటిని క్షణాల్లో సిద్దం చేసుకోవచ్చు. ఒకేసారి 24 కూకీస్ తయారు చేసుకోవచ్చు. పెద్ద ఓవెన్ లేకపోతే రెండు భాగాలు గా విభజించి కుక్ చేయవచ్చు.

కావాల్సిన పదార్థాలు :
3/4 కోకోనట్ పౌడర్
3/4 రాగి పిండి
1/2 గోధుమ పిండి
150 గ్రాముల బటర్
150 గ్రాముల చక్కెర
3/4 వెనీలా ఎక్ట్రాక్ట్
ఒక కోడి గుడ్డు

తయారీ విధానం:
సాప్ట్ బటర్ ను ఓ బౌల్ లో తీసుకోవాలి. బటర్ చల్లగా ఉండేల చూసుకోవాలి. బటర్ లో చక్కెర వేసి ప్లఫీ గా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. క్రీమీ గా బటర్ తయారు అయ్యాక ఎగ్, వెనీలా ఎక్ట్రాక్ట్ వేసుకోవాలి. దీనిని కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, రాగి పిండి , గోధుమ పిండి వేసి బాగా కలపాలి. పై నుండి చక్కెర వేసి లైట్ గా కలపాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని ఓ గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి.

ముందుగానే ఓవెన్ ను 180c దగ్గర వేడి చేసుకోవాలి. గంట తర్వాత పిండిని తీసి బేకింగ్ షీట్ మీద కుకీస్ షేప్స్ చేసుకోవాలి. వీటిని 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాచ్ లుగా కుకీస్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ కుకీస్ ను air టైట్ జార్ లో స్టోర్ చేసుకుని కావలసినప్పుడు తినవచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

15 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

5 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.