Categories: HealthLatestNews

Araku Coffee: అరుకు కాఫీ తాగాలంటే కోటీశ్వరులై ఉండాల్సిందేనా? ధర ఏంటో తెలుసా?

Araku Coffee: కాఫీ తాగడం మన రోజువారీ జీవితంలో చాలా సాధారణమైన అలవాటు. ఇండియాలో కోట్లాది మంది తమ లైఫ్ లో రోజుకి ఒక కాఫీ అయినా తాగుతారు. కాఫీ తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుందని అందరూ భావిస్తారు. అందుకే దానిని అలవాటుగా మార్చుకుంటారు. ఇక టీ, కాఫీ వ్యాపారంతోనే కోట్లు గడించిన వారు ఇండియాలో ఉన్నారు. కాఫీ డే షాపులు ఇండియాలో ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే.  అలాగే ఇరానీ టీకి కూడా మంచి గిరాకీ ఉంది. ఈ కాఫీ, టీల గురించి ఇండియాలో పాటలు కూడా ఫేమస్ అయ్యాయి.

అయితే కాఫీ అయినా, టీ అయినా మామూలుగా అయితే 10 రూపాయిల ధర ఉంటుంది. అదే కార్పొరేట్ కాఫీ స్టాల్స్ లో అయితే గట్టిగా వేసుకుంటే 80 రూపాయిల వరకు ఉంటుంది. అయితే స్టేచర్ బట్టి కాఫీ తాగే ప్లేస్ మారుతుంది. ఇండియాలో కాఫీ షాపులు చాలా ఉన్నాయి. హ్యాంగోవర్ స్పాట్స్ గా వీటిని ఉద్యోగులు భావిస్తూ ఉంటారు. కాఫీ తాగి కాస్తా సేదతీరే ప్రయత్నం చేస్తారు. ఇండియాలో కాఫీ అంటే కర్ణాటకలో ఊటీ చాలా ఫేమస్ అక్కడ కాఫీ ఫార్మ్స్ చాలా ఉంటాయి. పదుల సంఖ్యలో రైతులు కాఫీ తోటల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అక్కడ కాఫీకి మంచి డిమాండ్ ఉంది.

అయితే ఇప్పుడు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా మరో కాఫీకి మంచి డిమాండ్ ఉంది. అదే ఏపీలోని అరుకు కాఫీ. ఈ కాఫీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందంటే నమ్మడం కష్టం. గిరిజన రైతులు పండించే ఈ కాఫీ తోటల నుంచి గింజలని సేకరించి వాటిని ఇన్ స్టెంట్ కాఫీ పౌండర్స్ గా తాయారు చేసి ప్యాకింగ్ చేసి బెంగుళూరు నుంచి విదేశాలకి తరలిస్తున్నారు. ఆరుకు కాఫీ అనే బ్రాండ్ తోనే ఈ కాఫీ పౌడర్ ని విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. జపాన్, బ్రెజిల్, అమెరికా లాంటి దేశాలలో అరుకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఎంత రేటు అయినా పెట్టి కొనేందుకు అక్కడి ప్రజలు రెడీఅవుతున్నారు.

అలాగే జపాన్ లో కాఫీ షాపులలో ప్రత్యేకంగా అరుకు కాఫీ పేరుతో కప్పులలో విక్రయిస్తున్నారు. ఇక ఈ కాఫీ ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండియన్ కరెన్సీలో కప్పు కాఫీ ధర అక్షరాల 637 రూపాయిలుగా ఉంది. జపాన్ లో ఇంత ధర పెట్టుకొని కొనడానికి అక్కడి ప్రజలు పెద్దగా వెనుకాడరు. వారి కరెన్సీలో కాఫీ ధర ఏడు డాలర్లు మాత్రమే. సేంద్రియ పద్దతిలో అటవీప్రాంతంలో ఈ కాఫీ పంటని సాగు చేయడంతో వీటికి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.