Health: చలికాలం చంపేస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం 5 దాటంగానే వణుకు పుడుతోంది. ఈ సమయం లో ఏం తిందామన్నా హాట్ గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది . ఓ సూప్ వేస్తే ప్రాణం రిలాక్స్ అవుతుందని అందరి భావన అందుకోసమే కూరగాయలతో పాటు చికెన్ తో చేసే రుచికరమైన సూప్ రెసిపీని మీకు అందిస్తున్నాము. ఈ కూల్ కూల్ వింటర్ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఈ సూప్ రెసిపీ సరైనదిగా ఉంటుంది.
వెజ్ సూప్ అంటే పిల్లలు తినరు, నాన్ వెజ్ ఆడ్ చేస్తే ఎవ్వరైనా ఇట్టే తాగడానికి ఇష్టపడతారు. మరి ఈ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
పదార్థాలు :
చికెన్ : ఒక కప్పు
తురిమిన క్యారెట్ : మీడియం కప్పు
బీన్స్ : 1 /2 కప్పు
కార్న్ : 1 /2 కప్పు
ఉప్పు : తగినంత
ఒరిగానో : తగినంత
బ్లాక్ పెప్పర్ : తగినంత
కొత్తిమీర : గార్నిష్ కు సరిపడినంత
తయారీ విధానం :
చికెన్‌ను కొద్దిగా ఉప్పు వేసి టెండర్ నెస్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడకబెట్టిన పులుసును ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో బాయిల్ చేసిన పులుసును , కూరగాయలను కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి , ఒరిగానో వేసుకోవాలి. కూరగాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు బాయిల్ చేసి కట్ చేసిన చికెన్ పీసెస్ ను ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసి హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.