Categories: DevotionalLatestNews

Solar Eclipse: సూర్య గ్రహణం ఎఫెక్ట్… మొత్తం స్తంభించిపోయింది

Solar Eclipse: మారుతున్న కాలంతో పాటు ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నా యి. విజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో అనాదిగా వస్తున్న మూఢ విశ్వాసాలకి కూడా ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశంలో మాత్రం ఇప్పటికి మత విశ్వాసాలని ఆచరించే వారు ఎక్కువ అయ్యారు. అలాగే ఈ మధ్యకాలంలో అయితే ప్రాచీన నాగరికత, విజ్ఞానం అంటూ సైన్స్ కి, జ్యోతిష్యానికి సంబంధం కలిపేసి చెబుతున్నారు. సూర్యగ్రహణం సమయంలో అసలు ఎలాంటి పనులు చేయకూడద ని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. అయితే సైన్స్ లో ఎక్కడా కూడా అలాంటి విషయాలని ప్రస్తావించలేదు.

ఇప్పటికే సూర్యగ్రహణం సమయంలో వెలువడే కాంతి కిరణాలతో ఏమైనా ప్రమాదకర కారకాలు ఉన్నాయా అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూర్య గ్రహణం రోజున ఇండియాలో ప్రధాన నగరాలన్నీ రెండు గంటల పాటు పూర్తిగా మూగబోయాయి అని చెప్పాలి. రోజువారీ గా జరిగే కార్యకలాపాలు అన్ని కూడా ఈ సూర్యగ్రహణం పడిన సమయంలో పూర్తి గా మందగించాయి. వ్యాపారులు వారి వ్యాపారాలని కూడా ఆపేసారు. హిందుత్వాన్ని, భారతీయ సనాతన ధార్మిక విశ్వాసాల్ని ఇప్పటికి నమ్మే ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు.

విశేషం ఏంటంటే తెలంగాణలో మునుగోడులో ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉండగా నాయకులు సూర్యగ్రహణం పడ్డ సమయంలో పూర్తిగా తమ ప్రచారం నిలిపేశారు. ఇక అలాగే జ్యోతిష్యులు చెప్పిన విషయాలని సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలు ఎక్కువగా వీక్షించారు. సూర్యగ్రహణం ఏ సమయంలో పడుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని సెర్చ్ చేసి తెలుసుకున్నారు. ఇక వీటిని మెజారిటీ ప్రజలు అనుసరించడంతో సూర్యగ్రహణం కంటే ముందుగానే ఇళ్ళకి చేరుకున్నారు. ఇక గ్రహణం సమయంలో డోర్స్ క్లోజ్ చేసుకొని ఇళ్లల్లోనే ఉన్నారు.

దీంతో ప్రధాన నగరాలలో రహదారులు అన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎక్కడో ఒకటి, అర అనే విధంగా వాహనాలు, మనుషులు కనిపించారు. పూర్తిగా రోడ్లు ఖాళీ అయిపోవడంతో మళ్ళీ కరోనా లాక్ డౌన్ సమయంలో ఉన్నట్లు అనిపించింది. అయితే కొంత మంది మాత్రం సూర్య గ్రహణం సమయంలో జ్యోతిష్యం చెప్పే విషయాలు అన్ని కూడా కేవలం మూఢ నమ్మకాలు అంటూ విజ్ఞాన శాస్త్రాన్ని విశ్వసించే వారు నిరూపించే ప్రయత్నం చేశారు. గ్రహణం పడిన సమయంలోనే రోడ్డుపై భోజనాలు చేస్తూ ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని చేసిన దైవం ఉందని విశ్వసించినంత కాలం ఈ గ్రహణం సమయంలో పెట్టె నియమాలని కూడా ప్రజలు కచ్చితంగా పాటిస్తారు అనేది మరోసారి రుజువైంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.