Health: చలికాలం చంపేస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం 5 దాటంగానే వణుకు పుడుతోంది. ఈ సమయం లో ఏం తిందామన్నా హాట్ గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది . ఓ సూప్ వేస్తే ప్రాణం రిలాక్స్ అవుతుందని అందరి భావన అందుకోసమే కూరగాయలతో పాటు చికెన్ తో చేసే రుచికరమైన సూప్ రెసిపీని మీకు అందిస్తున్నాము. ఈ కూల్ కూల్ వింటర్ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఈ సూప్ రెసిపీ సరైనదిగా ఉంటుంది.
వెజ్ సూప్ అంటే పిల్లలు తినరు, నాన్ వెజ్ ఆడ్ చేస్తే ఎవ్వరైనా ఇట్టే తాగడానికి ఇష్టపడతారు. మరి ఈ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
పదార్థాలు :
చికెన్ : ఒక కప్పు
తురిమిన క్యారెట్ : మీడియం కప్పు
బీన్స్ : 1 /2 కప్పు
కార్న్ : 1 /2 కప్పు
ఉప్పు : తగినంత
ఒరిగానో : తగినంత
బ్లాక్ పెప్పర్ : తగినంత
కొత్తిమీర : గార్నిష్ కు సరిపడినంత
తయారీ విధానం :
చికెన్‌ను కొద్దిగా ఉప్పు వేసి టెండర్ నెస్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడకబెట్టిన పులుసును ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో బాయిల్ చేసిన పులుసును , కూరగాయలను కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి , ఒరిగానో వేసుకోవాలి. కూరగాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు బాయిల్ చేసి కట్ చేసిన చికెన్ పీసెస్ ను ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసి హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.
మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…
టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…
Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…
AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…
TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…
NATS: అమెరికాలోని షార్లెట్ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…
This website uses cookies.