Categories: LatestNews

Chandrayan 3 : జాబిల్లిపై సూర్యోదయం..మరి అవి నిద్రలేస్తాయా..?

Chandrayan 3 : భారత్ జాబిల్లిపై కాలు మోపింది.చంద్రయాన్ 3 ప్రయోగం సుక్సెస్ అయ్యింది. చంద్రుడు పై కాలు మోపినప్పటినుంచి లాండర్ రోవర్ తన పనిని మొదలుపెట్టాయి. చంద్రుడిపై ఉన్న వనరుల జాడను తెలుసుకునేందుకు గాను రోవర్ చంద్రుడు పై చక్కర్లు కొట్టింది శాస్త్రవేత్తలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. అయితే ప్రస్తుతంచం చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ జాబిలమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతున్నాయి. ఇదిలా ఉండగా 14 రోజుల తర్వాత జాబిల్లిపై మళ్లీ సూర్యోదయం జరగనుంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు వాటిని నిద్రావస్థ నుంచి యాక్టివ్ చేసేందుకు సిద్ధమయ్యారు. శాస్త్రవేత్తలు ప్రజ్ఞాన్ రోవర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

chandrayan-3-sunrise-over-moon-will-pragyan-rover-vikram-lander-wake-up

అయితే చంద్రుడిపై ఇన్నాళ్లు నిద్ర అవస్థలో ఉన్న ఇవి అక్కడి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకొన్న మళ్ళీ మనుగడ సాగిస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. సన్ లైట్ ని గుర్తించి ల్యాండర్, రోవర్ మళ్లీ వాటంతట అవే పని ప్రారంభించే ప్రక్రియ అంతా కూడా ఆటోమేటిగ్గా జరుగుతుందని చెప్పారు.

chandrayan-3-sunrise-over-moon-will-pragyan-rover-vikram-lander-wake-up

ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో జులై 14న చేపట్టింది. అగస్ట్ 23న చంద్రడిపై విక్రమ్ ల్యాండర్ స్మూత్ గా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తమ పనిని కంప్లీట్ చేసింది. శాస్త్రవేత్తలకు విలువైన సమాచారాన్ని అందించింది. ఈలోగా జాబిల్లిపై రాత్రి కావడంతో సెప్టెంబర్ 3న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను స్లీప్ మోడ్ లోకి పంపించారు ఇస్రోశాస్త్రవేత్తలు. ఈ క్రమంలో మళ్ళీ చంద్రుడిపై సూర్యోదయం జరుగుతుండటంతో ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తే జాబిల్లిపై చంద్రయాన్‌-3 ప్రయోగాలకు బోనస్‌ లభించినట్లు అవుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజల సైతం జాబిల్లి వైపే చూస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Liver Health: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా? మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే?

Liver Health: మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనే విషయాలను మన శరీర లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు. మన…

3 hours ago

Tirumala: తిరుమల వెళ్లే భక్తులు అలర్ట్..40 రోజుల పాటు భక్తులకు నో ఎంట్రీ..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి అధికారులు కీలక సూచనలను జారీ చేశారు. మరి కొద్ది రోజులలో శ్రీవారి వార్షిక…

3 hours ago

Drinking water: అన్నం తింటూ నీళ్లు తాగుతున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే?

Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8…

1 day ago

Tholi Ekadashi 2026: తొలి ఏకాదశి.. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే జన్మజన్మల పాపాలు పోయినట్టే?

Tholi Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే…

1 day ago

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

3 days ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

4 days ago

This website uses cookies.