Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి, ఇప్పుడు సొంత కేబినెట్ సహచరురాలి నుంచే గట్టి సవాల్ ఎదురవుతోంది. సీనియర్ నాయకురాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శైలి ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేబినెట్‌లో కీలకమైన బీసీ మహిళా ముఖంగా ఉన్న తనకు, ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం, స్వేచ్ఛ లభించడం లేదనే అసహనంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కావాలనే తనను పక్కనబెడుతున్నారనే అనుమానాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా మారింది. కాంగ్రెస్ గూటికి చేరిన కడియం శ్రీహరి దూకుడు, మంత్రి సురేఖకు అస్సలు నచ్చడం లేదు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే హోదాలో కడియం తీసుకుంటున్న సొంత నిర్ణయాలు శాఖా మంత్రిగా ఉన్న సురేఖకు మింగుడుపడటం లేదు. ప్రోటోకాల్‌ను కాదని, కనీసం మంత్రికి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆర్డర్లు వేయడం కొండా వర్గాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

telangana-dissatisfaction-in-congress-konda-becomes-a-headache-for-revanth

Telangana: రేవంత్ రెడ్డి సర్కార్‌పై అలకబూనిన కొండా సురేఖ

ఈ మంటకు నెయ్యి పోసినట్లుగా యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకం వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో దేవాదాయ మంత్రి పాత్ర దాదాపు శూన్యమనే ప్రచారం సాగుతోంది. సీఎం కార్యాలయం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు హేమాహేమీల లీడ్‌లోనే ఈ లిస్ట్ ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. సొంత శాఖలో ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతున్నా తానొక రబ్బర్ స్టాంప్‌లా మిగిలిపోవాల్సి రావడంపై సురేఖ తీవ్రంగా నొచ్చుకున్నట్లు సమాచారం. ఈ ఆవేదనతోనే ఆమె ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారనే ప్రచారం నడుస్తోంది.

ఇప్పటికే ఒకసారి రేవంత్ రెడ్డి సర్కార్‌పై అలకబూనిన కొండా సురేఖను అప్పట్లో పెద్దలు నచ్చజెప్పారు. కానీ, ఈసారి పరిస్థితి హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని భావిస్తున్న ఆమె, ఈసారి రాష్ట్ర నాయకత్వంతో కాకుండా నేరుగా ఏఐసీసీ పెద్దల వద్దే పంచాయతీ పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానానికి తన గోడును వివరిస్తూ ఒక ఘాటు లేఖ రాయడానికి ఆమె గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరి రేవంత్ రెడ్డి ఈ కొండా వివాదాన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

3 days ago

Yawning: తరచూ ఆవలింతలు వస్తున్నాయా? మీరు గుండె ప్రమాదంలో ఉన్నట్టే?

Yawning: సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకోవడానికి ముందు పెద్ద ఎత్తున ఆవలింతలు రావడం అనేది…

4 days ago

Saturday spiritual: శ్రావణ చివరి శనివారం.. వెంకటేశ్వర స్వామి పూజలో ఈ తప్పు చేయొద్దు!

Saturday spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన తెలుగు మాసాలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ప్రతినెలా ఒక…

4 days ago

This website uses cookies.