Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అందుకే శివుడికి వివిధ రకాల అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటారు అయితే తెలిసి తెలియక భక్తులు కొన్ని వస్తువులను శివుడికి సమర్పించడం వల్ల పూర్తిగా దోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శివ పూజలు కొన్ని వస్తువులు పూర్తిగా నిషేధం. మరి శివుడికి పూజ చేసే సమయంలో ఎలాంటి వస్తువులను ఉపయోగించకూడదు అనే విషయానికి వస్తే..
సాధారణంగా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శ్రీ కృష్ణుడికి తులసీదళాలతో పూజలు నిర్వహిస్తాము కానీ శివ పూజకు తులసీదళాలు పూర్తిగా నిషేధమని చెప్పాలి. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్క ఆకులను శివుడి పూజలో ఉపయోగించకూడదు తులసి ఆకులకు బదులుగా బిల్వదలాలను ఉపయోగించడం వల్ల శివుడి ఆశీస్సులు మనపై ఉంటాయి. మన హిందూ సంప్రదాయాల ప్రకారం పసుపు కుంకుమ అనేది సౌభాగ్యానికి ప్రత్యేకగా భావిస్తాము అమ్మవారికి లేదా ఇతర దేవులను పూజించడానికి పసుపు కుంకుమను మొదట ఉపయోగిస్తాము కానీ శివుడికి మాత్రం పసుపు కుంకుమ సింధూరం వంటి వాటితో పూజ చేయకూడదు. శివ పూజలు కేవలం చందనం, బూడిద వంటి వాటిని మాత్రమే ఉపయోగించాలి.
శివుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య జరిగిన సంఘటనలో కేతకీ పుష్పం తప్పుడు సాక్ష్యం చెప్పిందని పురాణ కథ . ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పడంతో కేతకి పుష్పం తన పూజకు అనర్హమని శివుడు శపించినట్లు తెలుస్తోంది అందుకే శివ పూజలు కేతకి పుష్పం నిషేధం.శివపూజలో సాధ్యమైనంత వరకు తాజా, శుభ్రమైన పూజా సామగ్రినే ఉపయోగించాలని సంప్రదాయం చెబుతుంది. విరిగిన బియ్యం, వాడిపోయిన పూలు, దెబ్బతిన్న ఆకులు లేదా పాడైన నైవేద్యాలను సమర్పించకపోవడం మంచిది. శివపూజలో నీరు, పాలు, బిల్వపత్రాలు, చందనం, విభూతి, పుష్పాలు, పండ్లు వంటి వాటిని సమర్పించడం వల్ల శివయ్య ఆశీస్సులు మనపై ఉంటాయి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.