Chandrababu: ఏపీలో ఎన్నికల రణరంగం ఇప్పుడే కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేయడానికి చట్టాన్ని ఉపయోగించుకుంటుంది. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ బలమైన రాజకీయ కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితమైన వ్యూహాలతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. జనసేన బలం కూడా తొడవుతుంది అని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. వైసీపీని ఓడించడానికి ఉన్న అన్ని రకాల అవకాశాలని చంద్రబాబు వినియోగించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసుని చిట్ ఫండ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దీని వెనుక వైసీపీ ప్రమేయం ఉందని నమ్ముతున్నారు. మరోవైపు చాలా నియోజకవర్గాలలో వైసీపీ ఇన్ చార్జ్ లని ఏదో ఒక కేసు పెట్టి ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తోందనేది టీడీపీ వాదన. ఇదిలా ఉంటే వైసీపీ వేధింపులకి భయపడేది లేదని చెప్పుకొచ్చారు. ఇంత వరకు వైసీపీ నాయకుల విషయంలో కాస్తా ఆలోచించి వ్యవహరించానని, అయితే ఇప్పుడు తగ్గేది లేదని కామెంట్స్ చేశారు. అలాగే ఎవరికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. తన కోపం ఏంటో జగన్ రెడ్డి చూస్తాడని వార్నింగ్ ఇచ్చారు.
రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని, కచ్చితంగా ఇప్పుడు చేస్తున్నడానికి రెండింతలు బదులు చెల్లిస్తామని హెచ్చరించారు. మొత్తానికి ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు వైసీపీని దీటుగా ఎదుర్కోవడానికి తాను కూడా అగ్రిసివ్ పొలిటీషియన్ గా మారుతున్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో పద్ధతిగా సమాధానాలు చెబితే వినే పరిస్థితిలో ఎవరూ లేరనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా ఆయన రాజకీయ వ్యవహారాలు చూస్తూ ఉంటే తెలుస్తోంది. మరి ఈ అగ్రెసివ్ రాజకీయాలతో 2024 ఎన్నికలలో చంద్రబాబు ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి.