Categories: LatestMost ReadNews

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట అక్షరాలా నిజమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని ‘జొన్నగిరి’ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. “అక్కడ నిజంగానే బంగారం గనులు ఉన్నాయా? అది సాధ్యమేనా?” అని నిన్నమొన్నటి వరకు పెదవి విరిచిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా.. జొన్నగిరి స్వచ్ఛమైన బంగారం అప్పుడే మార్కెట్లోకి అడుగుపెట్టేసింది.

ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ బంగారు మైనింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన వెంటనే, మార్కెట్‌లోకి గోల్డ్ అందుబాటులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే తవ్వకాలు జరిగి, అప్పుడే బంగారం ఎలా వచ్చింది? అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ, ఈ మెరుపు విజయం వెనుక దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిశ్శబ్ద శ్రమ దాగి ఉంది. జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ వంటి సంస్థలు గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ భూగర్భ పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. పైగా, అధికారిక ప్రారంభోత్సవానికి ముందే.. గత కొన్ని నెలలుగా ఇక్కడ ప్రయోగాత్మకంగా ముడి రాయిని తవ్వి, ప్రాసెస్ చేసే పనులు నిరంతరాయంగా సాగాయి. ఆ ట్రయల్ రన్స్‌లో సేకరించిన బంగారమే ఇప్పుడు తొలి విడతగా మార్కెట్‌లోకి విడుదలైంది.

chandrababu-jonnagiri-gold-has-it-already-hit-the-market

Chandrababu: ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రెండో దశ విస్తరణ ప్లాంట్

ప్రస్తుతం తొలి దశలో భాగంగా సుమారు 600 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మొదటి ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 400 కిలోల మేలిమి బంగారాన్ని ఉత్పత్తి చేయాలని కంపెనీ పక్కా ప్లాన్‌తో ఉంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రెండో దశ విస్తరణ ప్లాంట్ కూడా పూర్తయితే.. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి ఏకంగా 900 కిలోల నుంచి రెండు టన్నుల వరకు పెరుగుతుందని అంచనా.

భారతదేశానికి ముడి చమురు తర్వాత అత్యధికంగా విదేశీ కరెన్సీ ఖర్చవుతున్నది బంగారం దిగుమతుల కోసమే. మన దేశం ఏటా దాదాపు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో జొన్నగిరి ప్రాజెక్ట్ దేశీయ అవసరాలకు కొంతైనా ఆసరాగా నిలిచి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయనుంది.

chandrababu-jonnagiri-gold-has-it-already-hit-the-market

ఈ ప్రాజెక్టు కేవలం బంగారాన్ని తవ్వి అమ్మేయడానికే పరిమితం కావడం లేదు. ఇక్కడ దొరికే గోల్డ్‌తో స్థానికంగానే ఒక అత్యాధునిక ‘జ్యువెలరీ పార్క్’ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే గనుక కార్యరూపం దాల్చితే.. రాయలసీమ ప్రాంతంలోని వేలాది మంది స్థానిక యువతకు, ముఖ్యంగా మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి నిన్నటివరకు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జొన్నగిరి.. ఇకపై దేశ ఆర్థిక రాతను మార్చే గోల్డ్ హబ్‌గా మారబోతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.