AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉండి, ఒంగోలును తన గుప్పిట్లో పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ఇప్పుడు జనసేనలో కింగ్ మేకర్‌గా మారుతున్నారు. మొదట్లో కొత్త పార్టీలో సర్దుకుపోవడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన అనూహ్య ప్రాధాన్యతతో బాలినేని రూట్ మార్చారు. జిల్లా బాధ్యతలతో పాటు చేరికల కమిటీలో కీలక స్థానం దక్కించుకోవడంతో.. ఇప్పుడు ఆయన పాత కోటపైనే గురిపెట్టారు.

బాలినేని రాకతో ప్రకాశం జిల్లా జనసేనలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఒంగోలు జిల్లా కమిటీ రద్దు వెనుక, బాలినేనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, బాలినేని ఊరికే కూర్చోవడం లేదు. జగన్ క్యాంప్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్లను ఏరికోరి జనసేనలోకి లాగేందుకు ఆయన ఒక భారీ ఆపరేషన్ మొదలుపెట్టారని, అది ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని భోగట్టా.

ap-news-balineni-srinivasa-reddys-operation-successful-shockwaves-in-ycp

AP NEWS: బాలినేని వేసిన మొదటి అడుగు.. కందుకూరు పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది.

ఈ పొలిటికల్ ఆపరేషన్‌లో భాగంగా బాలినేని వేసిన మొదటి అడుగు.. కందుకూరు పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఆ నియోజకవర్గంలో తిరుగులేని పట్టున్న మాజీ మంత్రి, సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేన వైపు తిప్పడంలో బాలినేని సగం సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. 2019లో వైసీపీ నుంచి గెలిచినా మహీధర్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కనీసం 2024లో సీటు అయినా ఇస్తారనుకుంటే.. అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది.అప్పటినుంచి వైసీపీకి దూరంగా ఉంటూ, గత ఎన్నికల్లో కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన మహీధర్ రెడ్డిని.. బాలినేని ఇప్పుడు జనసేన వైపు నడిపిస్తున్నారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీలో సరైన లీడర్‌షిప్ లేక కేడర్ అంతా అయోమయంలో ఉంది. ఇటువంటి టైమ్‌లో మహీధర్ రెడ్డి లాంటి సీనియర్ కూడా చేజారితే.. జిల్లాలో వైసీపీ కోలుకోవడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. బాలినేని ప్లాన్ సక్సెస్ అయితే, కందుకూరుతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. మరి ఈ పొలిటికల్ క్రైసిస్ నుంచి జగన్ తన పార్టీని ఎలా కాపాడుకుంటారో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.