Tollywood: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఎలాంటి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. హీరోలలో ఆర్జీవీకి నచ్చే ఒకే ఒక నటుడు బిగ్ బి అమితాబ్. వీరి కాంబినేషన్‌లో సర్కార్, సర్కార్ 2 లాంటి చిత్రాలొచ్చాయి. సర్కార్ సినిమా కథ చెప్పినప్పటి నుంచి ఒకరికొకరు సర్కార్ అనే పిలుచుకుంటారు. అమితాబ్ అంటే ఆర్జీవీకి, ఆర్జీవీ అంటే అమితాబ్ కి మంచి రెస్పెక్ట్ ఉంది.
అందుకే, ఆర్జీవీ ఎప్పుడైనా అమితాబ్ ఇంటికి ఈజీగా వెళ్లిపోతారు. వరుస ఫ్లాప్స్ వస్తున్న సమయంలో ఆర్జీవీకి కాల్ చేసిన పూరి జగన్నాద్ ..నాకు అమితాబ్ అపాయింట్‌మెంట్ కావాలి నేనొక కథ చెప్పాలంటూ అడిగారు. దాంతో ఆర్జీవీ స్వయంగా బిగ్ బి దగ్గర టైం తీసుకొని పూరిని తీసుకెళ్ళారు. ఇక్కడ హైలెట్ ఏమిటంటే కథ చెప్పడానికి తీసుకెళ్ళిన ఆర్జీవీనే పూరి బయటకి పంపడం. ఆయన ఉంటే నేను మీకు కథ చెప్పలేనంటూ అమితాబ్ కి చెప్పారట. అది విని అమితాబ్ ఆర్జీవీకి బయటకి వెళ్ళమన్నట్టుగా సైగ చేశారట.
ఓ గంట సేపట్లో పూరి కథ మొత్తం బిగ్ బితో పాటు ఆయన సతీమణి జయ బచ్చన్ కి చెప్పారట. ఆ తర్వాత ఆర్జీవీని లోపలికి పిలిచి..కథ అంతా బావుంది కానీ, ఆ సీన్స్‌లో..అంటూ ఏదో డౌట్ పడ్డారట. అది ఆర్జీవీకి కోపం తెప్పించింది. వాడేదో మీ ఫ్యాన్. మీతో సినిమా చేయాలని వచ్చాడు. వాడ్ని పట్టుకొని డౌట్లు గివుట్లు అంటారు ఏంటీ సర్కార్. ఈ సినిమా హిట్టైందే అనుకో అమితాబ్ ఇంక ఇంతకంటే పైకెళ్ళడానికేముంటుంది. ఒకవేళ ఫ్లాప్ అయింది.. ఇంతకంటే కిందకి వెళతారా..ఐ హేట్ యూ సర్కార్..అంటూ పూరిని తీసుకొని వెళ్ళిపోయారట. ఆ తర్వాత కథ ఓకే అనుకున్నారు. ‘బుడ్డా హోగా తేరే బాప్’ పేరుతో వచ్చి మంచి హిట్ సాధించింది.
ఇంత బాండింగ్ ఉన్న ఆర్జీవీ అమితాబ్ మదర్ చనిపోయినప్పుడు వెళ్ళలేదు. ఓ 10 రోజుల తర్వాత వెళ్ళి పలకరించారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏ విధంగా పరామర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ఆర్జీవీ చాలా డిఫరెంట్ కదా. అందుకే, తల్లి చనిపోయిన బాధలో ఉన్న బిగ్ బికి ఓ సెక్స్ జోక్ చెప్పి నవ్వించి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.