Blue Moon : రాఖీపూర్ణిమ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది . ఇవాళ రాత్రి వేళ జాబిల్లి సరికొత్తగా కనిపించనుంది. చంద్రుడు నీలం రంగులో పెద్దగా, ప్రకాశవంతంగా మారనున్నాడు. అందుకే దీనిని బ్లూ మూన్ అంటారు. ఒకే నెలలో రెండు పున్నములు రాబోతున్నాయి . ఒకటి ఆగస్టు నెల 1వ తేదీన సంభవించింది. దాన్ని సూపర్ మూన్‌గా పిలిచారు. మరొకటి ఆగస్ట్ 30న అంటే ఇవాళ రాబోతుంది. దీనిని సూపర్ బ్లూ మూన్ గా భావిస్తున్నారు .భూమికి అత్యంత దగ్గరగా ఇది రానుంది. ఎప్పుడు కనిపించేలా కాకుండా మరింత పెద్దగా, ప్రకాశవంతంగా మెరుస్తూ చందమామ కనిపిస్తుంది. ఇవాళ రాత్రి 7.10 గంటల తరువాత ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ . కనిపించానుంది. ఇవాళ్టి నుంచి రేపు తెల్లవారుజామున 3. 36 గంటల వరకు సూర్యుడికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఈ సూపర్ బ్లూ మూన్ ఉండనుండి.
పౌర్ణమి రోజుల కంటే కూడా సూపర్ మూన్ సమయంలో జాబిల్లి మరింత ప్రకాశవంతంగా కనువిందుగా కనిపిస్తుంది. చందమామ కూడా పరిమాణంలోనూ భారీగా కనిపిస్తాడు. బుధవారం రాత్రి ఏర్పడే చంద్రుడు తన వెలుగులతో అందరిని అక్కర్శించనున్నాడు . సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెల వెలుగు రెట్టింపు కనిపిస్తుంది. ఆకాశంలో ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు ప్రతి రెండున్నర సంవత్సరాలకు కానిపిస్తాయి .
అయితే ఈ నెలలో ఒకేసారి రెండు పున్నములు ఏర్పడతాయని నాసా ముందుగానే చెప్పింది. ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్‌తో కలిసి రావడం అరుదైన సందర్భమే. ఈ బ్లూ మూన్ గత ఏడాది 2021 ఆగస్టు నెలలో ఏర్పడింది . ఆ తర్వాత ఇవాళే కనిపించనుంది. బుధవారం ఏర్పడే ఈ బ్లూ మూన్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. బుధవారం రాత్రి 8 గంటలకు IST సూపర్ బ్లూ మూన్ యొక్క ఉత్తమ రూపాన్ని ప్రపంచం చిదబోతోంది. దీని తర్వాత సూపర్ బ్లూ మూన్ రావాలంటే మరో 14 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జనవరి లేదా మార్చి 2037లో మళ్ళీ బ్లూ మూన్ కనిపిస్తుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.