Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శన కి వచ్చిన ఓ కుటుంబంలోని రేవతి అనే మహిళ అల్లు అర్జున్ చూసేందుకు జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది.
దీనికి కారణం సంధ్య థియేటర్స్ యాజమాన్యం, పోలీసుల అసమర్ధత అలాగే అల్లు అర్జున్ బాధ్యత వహించలేదనే కారణాలను చూపెడుతూ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని డిసెంబర్ 13న తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
Big Breaking: ఈరోజు ఉదయం 6 గంటలకి ఆయన జైలు నుంచి బయటకి అల్లు అర్జున్
దాంతో అల్లు అర్జున్ తరపున న్యాయవాది హైకోర్టులు పిటీషన్ వేయగా 50 వేల బాండ్ ఏదైనా సమర్పించి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ, బెయిల్ కి సంబంధించిన పేపర్స్ జైలు అధికారులకి అందలేదని ఆయనను నిన్న రాత్రంతా జైలులోనే ఉంచారు. హైకోర్టు విడుదల ప్రకటించినప్పటికీ సరైన సమయానికి డాక్యుమెంట్స్ అందకపోవడంతో అల్లు అర్జున్ విడుదలలో జాప్యం జరిగింది.
ఎట్టకేలకి ఈరోజు ఉదయం 6 గంటలకి ఆయన జైలు నుంచి బయటకి వచ్చి తన కారులో ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని ఇన్నాళ్ళు నెగిటివ్ గా వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రూ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ దంపతులు, నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ద్వారా పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతోంది. కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అంటూ ఆయన పోస్ట్ లో రాసుకొచ్చారు.
https://twitter.com/Abhisheklive4u/status/1867752010419704011